????????????☘?????????☘???????????????☘????????????
వాట్సాప్ వినియోగిస్తున్న వారెవరైనా కనీసం ఒక్క గ్రూప్‌లోనైనా సభ్యుడిగా ఉంటారు. ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా, మన బంధువులు, స్నేహితులను ఒక వేదికపైకి తీసుకొస్తోంది వాట్సాప్ గ్రూప్. తెలిసిన వారు గ్రూప్ క్రియేట్ చేసి మనల్ని చేర్చుకుంటే బాగానే ఉంటుంది కానీ, మనకు తెలియని వ్యక్తులు మనల్ని వివిధ గ్రూప్‌ల్లోకి చేరుస్తుంటారు. ఇక అక్కడి నుంచి మనకు అక్కర్లేని సందేశాలు, ఫార్వర్డ్ మెస్సేజ్‌లు, ఫొటోలు, వీడియోలు ఇలా సందేశాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. ఈ పోరు భరించలేక ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసినా, మళ్లీ కావాలని యాడ్ చేస్తారు. ఇక ఇలాంటి వాటికి మీరు చెక్ చెప్పవచ్చు. మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని కొత్తగా గ్రూప్‌లోకి యాడ్ చేయలేరు. బుధవారం నుంచి వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు ‘టిప్‌లైన్’ సర్వీసును తీసుకురాగా, ఇప్పుడు గ్రూప్ చాట్స్‌కు మరింత భద్రత కల్పించింది. ఎవరైనా మిమ్మల్ని కొత్తగా వాట్సాప్ గ్రూప్‌లోకి చేర్చాలంటే మీ అనుమతి తప్పనిసరి. గ్రూప్‌లో మీ నంబర్ యాడ్ చేయడానికి అడ్మిన్ ప్రయత్నించినప్పుడు మీరు ఆ గ్రూప్‌లో చేరాలా? వద్దా? అని మీకొక రిక్వెస్ట్ వస్తుంది. దానిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను పొందాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. అనంతరం Account > Privacy > Groups సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు Nobody, My Contacts, Everyone ఇలా ఎవరికి అనుమతి ఇవ్వాలో ఎంపిక చేసుకోవచ్చు. Nobody అని ఎంపిక చేసుకుంటే, కొత్త గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయాలన్నా మీ అనుమతి తప్పనిసరి. My Contacts ఆప్షన్ ఎంచుకుంటే మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయవచ్చు. ఈ సరికొత్త ఆప్షన్ వల్ల వినియోగదారుడికి మరింత నిర్ణయాధికారం లభిస్తుందని వాట్సాప్ వెల్లడించింది.
ఇక ఏ వాట్సాప్ గ్రూపులో మిమ్మల్ని జేర్చలేరు
Related tags :