1. తిరుమలలో వీఐపీ దర్శనాలను నిలువరించండి-హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం
తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్‌కు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. వీఐపీ దర్శనాలను నిలువరించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లా కోరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జాగర్లమూడి వెంకటసుబ్బారావు ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ఆరాధన హక్కు అందరికి సమానమంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అందుకు సంబంధించిన ఉత్తర్వులను తమ ముందుంచాలని పేర్కొంది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘భక్తుల మధ్య అసమానతలు పెంచేలా తితిదే.. వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతినిస్తోంది. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలంటూ భక్తులను విభజిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునే హక్కు కోల్పోతున్నారు. ఏ ఆధారం చేసుకొని వీఐపీల దర్శనం అనుమతిస్తున్నారని సమాచార హక్కు చట్టం కింద కోరితే తాము స.హ.చట్టం పరిధిలోకి రామని తితిదే వివరాలు ఇవ్వడం లేదు’ అని పేర్కొన్నారు.
2. వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. ఈ నెల 6న ప్రారంభమయ్యే శ్రీవికారి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మందిరాన్ని పరిశుభ్రం చేశారు. ఉదయం 6 నుంచి 11 వరకు జరిగిన కార్యక్రమంలో శ్రీవారి గర్భగుడి, కులశేఖరపడి, బంగారు వాకిలి ప్రాంగణాలను శుద్ధి చేసి గోడలకు సుగంధద్రవ్యాలతో కలగలిపిన చూర్ణాన్ని పూశారు. మందిరంలోని ఉప ఆలయాలు, ప్రసాద పోటును శుద్ధి చేశారు. ఆలయ ద్వారాలకు అలంకరించడానికి రూపొందించిన పరదాలను తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు శిరస్సులపై ఉంచుకుని ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా తీసుకెళ్లి స్వామి సన్నిధిలో అర్చకులకు అప్పగించారు. తిరుమంజనం సందర్భంగా ఉదయం 11 వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అనంతరం స్వామి ధర్మదర్శనాన్ని, శ్రీవారికి నిత్య సేవలను ప్రారంభించారు.
3. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలువరించండి
తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్‌కు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. వీఐపీ దర్శనాలను నిలువరించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లా కోరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జాగర్లమూడి వెంకటసుబ్బారావు ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ఆరాధన హక్కు అందరికి సమానమంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అందుకు సంబంధించిన ఉత్తర్వులను తమ ముందుంచాలని పేర్కొంది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘భక్తుల మధ్య అసమానతలు పెంచేలా తితిదే.. వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతినిస్తోంది. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలంటూ భక్తులను విభజిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునే హక్కు కోల్పోతున్నారు. ఏ ఆధారం చేసుకొని వీఐపీల దర్శనం అనుమతిస్తున్నారని సమాచార హక్కు చట్టం కింద కోరితే తాము స.హ.చట్టం పరిధిలోకి రామని తితిదే వివరాలు ఇవ్వడం లేదు’ అని పేర్కొన్నారు.
4. శ్రీవారి ఆలయానికి ఓపెన్ టాప్ లారీ బహూకరణ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకగా ఓపెన్ టాప్ లారీని అశోక్‌లేల్యాండ్ ప్రతినిధులు బహూకరించారు. శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం గ్లోబర్‌ట్రక్స్, లేల్యాండ్ ప్రెసిడెంట్ అనుజ్‌కెతురియలారీ లారీ తాళాలను, దస్త్రాలను ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్, రవాణాధికారి భాస్కర్‌నాయుడికి అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ పీఆర్వో రవి, కంపెనీ ప్రతినిధులు మోహన్, శ్రీకిరణ్, మూర్తి, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
5. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 3 జయప్రద
1680 : ఛత్రపతి శివాజీ మరణం (జ.1627).
1955 : భారత దేశ ప్రసిద్ధ గాయకుడు హరిహరన్ జననం.
1961 : అమెరికన్ నటుడు, గాత్ర నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, హాస్యనటుడు ఎడీ మర్ఫీ జననం.
1962 : తెలుగు సినీనటి మరియు పార్లమెంటు సభ్యురాలు జయప్రద జననం.
1964 : భారత క్రికెట్ క్రీడాకారుడు అజయ్ శర్మ జననం.
1973 : భారత దేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
1973 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి జననం.
1984 : మొదటి భారతీయ రోదసి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.
6. శుభమస్తు
తేది : 3, ఏప్రిల్ 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : త్రయోదశి
(నిన్న ఉదయం 8 గం॥ 38 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 54 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 49 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 24 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 40 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 6 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 18 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 43 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 13 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 9 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : కుంభము
శ్రీవారి ఆలయానికి ఓపెన్ టాప్ లారీ బహూకరణ
Related tags :