Movies

నన్ను నేను ఎక్కువగా నమ్ముతాను

tamanna says no space left

????????????☘?????????☘???????????????☘????????????
తెరపైనే కాదు.. సెట్లోనూ చలాకీగా ఉండే కథానాయిక తమన్నా. ఉరకలేసే ఉత్సాహంతో పని చేస్తుంటుంది. పనిలోనే విశ్రాంతి వెతుక్కుంటుంది. అదే తన బలం అని చెబుతుంటుంది తమన్నా. ‘‘చేసే పని ఎలాంటిదనేది చూడకండి. అందులో మీకు ప్రేమ కనిపిస్తే, ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయండి. అప్పుడు రాత్రీ పగలూ శ్రమించినా అది మిమ్మల్ని శారీరకంగా బాధించదు. ఈరోజు కాదు, ఎప్పటికైనా మీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది’’ అంటోంది. తన బలాబలాల గురించి మాట్లాడుతూ ‘‘నేనే నా ధైర్యం. నా చుట్టు పక్కల ఎంతమందైనా ఉండొచ్చు. వాళ్లిచ్చే ప్రోత్సాహం సెట్‌ బయట వరకే. కెమెరా ముందు ప్రతిభ చూపించాల్సింది నేనే. నన్ను నేను ఎక్కువగా నమ్ముతాను. అదే నా బలం. బలహీనతలూ కొన్ని ఉండొచ్చు. వాటిని ఎప్పటికప్పుడు దాటుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుంటా. ప్రతికూల ఆలోచనలు నన్నెప్పుడూ వెంటాడవు. వాటికెప్పుడూ నా మనసులో చోటు లేదు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిబ్బరంగా ఉండగలుగుతున్నా’’అని చెప్పింది తమన్నా.