పుల్లటి పదార్థాలు… పొద్దున్నే వద్దు!
కొందరు తినడానికి వేళలు పాటించరు. ఏం తింటున్నామని పట్టించుకోరు. దీనివల్ల చిక్కులు తప్పకపోవచ్చు.
* చాలామంది నిద్రలేవగానే కాఫీ, టీలూ తాగుతుంటారు. నిజానికి వీటిని పరగడపున తీసుకోకపోవడం ఉత్తమం. ముందుగా గోరువెచ్చని నీళ్లతో దినచర్యను మొదలుపెట్టాలి. లేదంటే వాటివల్ల హార్మోన్ల అసమతుల్యత బాధిస్తుంది.
* ఆలస్యంగా లేచినప్పుడు, లేదా పొరబాటునైనా పరగడుపున సోడా, ఇతర శీతలపానీయాల వంటి వాటి జోలికి వెళ్లకూడదు. ఇలా చేస్తే జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. పైగా అనారోగ్యాలు తప్పవు. వికారం, వాంతులు బాధించొచ్చు. వీటన్నింటి కంటే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.
* ఘాటైన మసాలాలు, పుల్లని పదార్థాలు, గ్రేవీ కూరల్ని ఉదయం పూట తీసుకోకూడదు. వీటిలోని నూనెలు వికారాన్ని తెచ్చిపెడతాయి. ఇదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడొచ్చని మరవకండి.