భర్త జెఫ్ బెజోష్‌తో విడాకులు తీసుకున్న అనంతరం మెకంజీ బెజోస్ ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో చేరనున్నారు. జెఫ్ తన ఆస్తిలో నుంచి భారీ మొత్తాన్ని భార్య మెకంజీకి భరణంగా ఇవ్వనున్నారు. దీంతో మెకంజీ ఒక్కసారిగా కుబేరులురాల జాబితాలో చేరతారు. ఇప్పటికే భర్త జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనికుడిగా ఖ్యాతిగాంచారు. ఇప్పుడు మెకంజీ సైతం ప్రపంచ ధనికుల జాబితాలో చోటు సంపాదించనుండం ప్రాధాన్యంగా మారింది. ప్రపంచ అత్యంత ధనిక మహిళల్లో మెకంజీ మూడో స్థానాన్ని సంపాదించానున్నారు. 107 బిలియన్ డాలర్లతో జెఫ్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారు. కాగా ప్రస్తుతం మెకంజీ వాటా కింద 35.6 బిలియన్ డాలర్లు రానుంది. దీంతో ప్రపంచంలోని మూడవ ధనిక మహిళగా మెకంజీ అవతరించనున్నారని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.తమ విడాకులకు సంబంధించి మెకంజీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చారు. తమ వివాహ బంధాన్ని విజయవంతంగా రద్దు చేసుకున్నట్లు, ఆస్థి పంపకాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు మెకంజీ పేర్కొన్నారు. ఇక తాము మంచి మిత్రుగానో కో-పేరెంట్స్‌గా ఉండేందుకో సిద్ధమవుతున్నామని చెప్పారు. అద్భుతమైన గతమని, ఇక జరగబోయేదాని గురించి ఆలోచించాలని పేర్కొన్నారు.
జాబితాలోకి వచ్చేసింది
Related tags :