* చెన్నైలో మార్కీ బ్రిటిష్ ఆటోమేకర్ ఎంజీ మోటార్ అత్యంత ఆధునిక సాంకేతికతతో తరువాత తరం ‘ఇస్మార్ట్’ కారును త్వరలో భారత్‌లో ప్రవేశ పెట్టబోతుంది. ఈ ఏడాది జూన్‌లో తొలి ఇంటర్నెట్ కారు విడుదల చేస్తున్నామని, చెన్నై సహా భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈ కారు అందుబాటులో ఉంచుతామని ఎంజీ మోటార్ సంస్థ ప్రకటనలో తెలిపింది.ఎంజీ హెక్టార్ ఇస్మార్ట్ పేరుతో ఈ కారులో ఎంఐఎం రకం సిమ్ పొందుపరు స్తారు. ఇది కారును ఇంటర్నెట్‌తో అనుసం ధానిస్తుంది. సిస్కో, ఎయిర్‌టెల్ భాగ స్వామ్యంతో కొత్త సాఫ్ట్‌వేర్ తయారు చేశారు. ఎంజీ హెక్టార్‌లో 5జి నెట్‌వర్క్ ఆధారిత ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 (ఐపీవీ6) కూడా అందుబాటులో ఉన్నట్లు ఎంజీ మోటార్స్ ఎండీ రాజీవ్ చాబా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
*టాటా మోటార్స్ కు చెందిన విలాస కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) అమ్మకాలు మార్చిలో 6 శాతం వృద్ధితో 24,862గా నమోదయ్యాయి. బ్రిటన్ కేంద్రంగా పని చేసే సొసైటీ ఆఫ్ మోటార్ మ్యానుఫాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ గణాంకాల ప్రకారం.. జాగ్వార్ బ్రాండ్ వాహన విక్రయాలు 20 శాతం పెరిగి 8,182కు చేరాయి. ఇక ల్యాండ్ రోవర్ అమ్మకాలు 16,680 వద్ద స్తబ్దుగా నమోదయ్యాయి.
*ఉక్కు ఫర్నీచర్ విభాగంలోకి ఫోర్మా బ్రాండ్‌తో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ లివింగ్ అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో రూ.200 కోట్ల ఆదాయంపై కన్నేసిన సంస్థ.. 2024-25 నాటికి రూ.1000 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
*ఆటోమోటివ్ బ్యాటరీలు, ఇతర ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన సంస్థ అయిన లివ్‌గార్డ్‌కు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థల నుంచి రూ.220 కోట్ల మూలధనం లభించింది.
* జెట్ ఎయిర్‌వేస్‌లో వాటా విక్రయానికి ఈనెల 6 నుంచి బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ యాజమాన్య బాధ్యత స్వీకరించిన బ్యాంకర్లు తెలిపారు.
*భారత్ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1% నమోదు కావొచ్చని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది.
*జీఎంఆర్ గ్రూపు అనుబంధ సంస్థ జీఎంఆర్ హైదరాబాద్ అంతార్జాతీయ విమానాశ్రయం (జీహెచ్‌ఐఏఎల్) అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 30 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2,100 కోట్లు) సమీకరించనుంది.
*భారత్ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1% నమోదు కావొచ్చని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది.
*ఎఫ్‌సీఏ ఇండియా తమ ఎస్‌యూవీ జీప్ కంపాస్‌లో ‘స్పోర్ట్ ప్లస్’ వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది.
*అమరరాజా బ్యాటరీస్‌లో జాన్సన్ కంట్రోల్స్ నుంచి 2 శాతం వాటా గల్లా కుటుంబం కొనుగోలు చేయనుంది. ఈ కంపెనీ ప్రమోటర్లుగా ఉన్న గల్లా కుటుంబానికి 26 శాతం, అదేవిధంగా విదేశీ సంస్థ అయిన జాన్సన్ కంట్రోల్స్‌కు మరో 26 శాతం వాటా ఉన్నాయి.
*నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లకు ఉద్దీపన పథకాలు ప్రకటించేందుకు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సూత్రప్రాయంగా అంగీకరించిందని సమాచారం.
* విజయ్ మాల్యా విలాస పురుషుడుగానే ఎక్కువ మందికి తెలుసు. కింగ్ ఫిషర్ యజమానిగా ఆయన అనుభవించిన భోగభాగ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
*విజయ్ మాల్యా విలాస పురుషుడుగానే ఎక్కువ మందికి తెలుసు. కింగ్ ఫిషర్ యజమానిగా ఆయన అనుభవించిన భోగభాగ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
*దివాలా పరిష్కారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో నూతన మార్గదర్శకాలను జారీ చేయనుంది.
త్వరలో భారత్‌కు ఇస్మార్ట్ కారు-వాణిజ్య-04/05
Related tags :