సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫిరోజ్‌షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ఓడిపోయింది. టోర్నీలో మూడో ఓటమి చవిచూసింది. ఈ ఓటమిపై స్పందించిన దిల్లీ ప్రధాన కోచ్ రికీపాంటింగ్ క్యూరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత చెత్త పిచ్ మరెక్కడా ఉండదని మండిపడ్డాడు. ‘ఈ వికెట్ చాలా విచిత్రంగా ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిచ్ స్పందిస్తున్న తీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యాం. మ్యాచ్‌కు ముందు పిచ్ క్యూరేటర్‌తో మాట్లాడితే.. ఇదే మంచి పిచ్ అని చెప్పాడు. కానీ తర్వాత తెలిసింది. ఇది చెత్తపిచ్‌లోకెళ్ల చెత్త పిచ్ అంటూ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బౌలింగ్ విషయంలో సన్ రైజర్స్ ఆటగాళ్లను మెచ్చుకోవాలి. ఆ జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. నకుల్ బంతులు, స్లోవర్ డెలివరీలు వేసి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. పిచ్ ఇలా ఉంటుందని మాకు ముందే తెలిసి ఉంటే జట్టులో మార్పులు చేసి.. పిచ్‌కు నప్పే బౌలర్లను తీసుకునేవాళ్లం. అయితే దిల్లీ ఆటగాళ్లు అంచనాల మేరకు ఆడలేకపోయారు. దిల్లీ బ్యాట్స్‌మెన్ బంతులను బాదే విధానం ఏమాత్రం బాగాలేదు. బంతిని బాదే ముందు ఏ బంతిని బాదాలో.. ఏ బంతిని వదిలేయాలో.. సరిగ్గా అంచనా వేయాల్సి ఉంది. ఈ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుని టోర్నీలో పుంజుకుంటామని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదొక పిచ్చి నా పిచ్
Related tags :