DailyDose

జనసేనానికి వడదెబ్బ–తాజావార్తలు–04/05

sunstroke to pawan kalyan

* జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వడదెబ్బవిజయనగరం పర్యటన తర్వాత అస్వస్థతకు లోనైన పవన్ జయవాడలో పవన్ కు వైద్య పరీక్షలువిశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచనసత్తెనపల్లి, తెనాలి రోడ్ షో రద్దు చేయాలని పార్టీ వర్గాల నిర్ణయం.
*టెలికాం మార్కెట్లో నువ్వా నేనా? అంటూ పోటీపడుతోన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ, ఎయిర్‌ టెల్‌కు చెందిన సునిల్ మిట్టల్‌ లు… ఎంటర్‌ టైన్‌‌‌‌మెంట్ రంగంలోనూ పోటీకి సై అన్నారు . సంక్షోభంలో చిక్కుకున్న సుభాష్ చంద్రకు చెం దిన జీ ఎంటర్‌ టైన్‌‌‌‌మెంట్ ఎంటర్‌ ప్రైజస్‌ ను కొనుగోలు చేసేం దుకు వీరిద్దరూ ముందుకు వచ్చారు. జీ ఎంటర్‌ టైన్‌‌‌‌మెంట్‌ లో వాటాలు కొనేందుకు భారతీ ఎయిర్‌ టెల్‌ కూడా ప్రయత్నాలు ప్రారంభించిందని బ్లూ మ్‌ బర్గ్ రిపోర్టు చేసింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి . రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా జీ లోవాటాల కొనుగోలుకు బిడ్డింగ్ వేసేందుకు సిద్ధంగా ఉందని బ్లూమ్‌ బర్గ్ తెలిపింది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నావని సంబంధిత వర్గాలు తెలిపాయి.జీ ఎంటర్‌ టైన్‌‌‌‌మెంట్‌ లో వాటాలు కొనేం దుకు అంతకముం దు కూడా సోనీ పిక్చర్స్, కామ్‌ కాస్ట్‌‌‌‌లు పోటీపడుతున్నట్టు రిపోర్టులు వచ్చాయి . తాజాగా ముఖేష్ అంబానీ, సునిల్ మిట్టల్‌ లకు కూడా జీలో వాటాలు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించినట్టు బ్లూమ్‌ బర్గ్ తెలిపింది. ఇరువురికి ఇప్పటికే టెలికాం మార్కెట్‌ లో తీవ్ర పోటీ ఉంది. టెలికాం రంగంలోకి ముఖేష్ ప్రవేశిం చిన తర్వాత, జియో ద్వారా పలు సంచలనాలను సృష్టిం చారు. ఆ దెబ్బకు టెలికాం మార్కెట్‌ లో అగ్రగామిగా ఉన్న భారతీ ఎయిర్‌ టెల్ కుదేలైంది. దీంతో జియోకు ఎలాగైనా చెక్‌‌‌‌ పెట్టాలని మిట్టల్ భావిస్తున్నారు .టెలికాం అనంతరం ఈకామర్స్, ఎంటర్‌ టైన్‌‌‌‌మెంట్ రంగంలోనూ తన ముద్ర వేయాలని జియో ప్లాన్ వేసింది. ఈ క్రమంలో భాగంగా ఎస్సెల్ గ్రూప్ విక్రయిస్తోన్న జీఎంటర్‌ టైన్‌‌‌‌మెంట్‌ లో వాటాలను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర జీ ఎంటర్‌ టైన్‌‌‌‌మెంట్ ఎంటర్‌ ప్రైజస్ లో సగం వాటాలను అమ్మనున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు ఏటీ అండ్ టీ ఇంక్, వొడాఫోన్ గ్రూప్ పీఎల్‌ సీ, కేడీడీఐ కార్ప్ వంటివి ఫిల్మ్, టెలివిజన్ ప్రొడక్షన్, కేబుల్ టీవీ ఆస్తులను కొనుగోలు చేస్తున్నాయి . ఈ కొనుగోళ్లతో కంటెం ట్‌ ను సేకరిం చి ఇంటర్నెట్ ద్వారా ప్రొగ్రామింగ్ ఆఫర్ చేస్తున్నాయి . నెట్‌ ఫ్లి క్స్ ఇంక్, అమెజాన్.కామ్ ఇంక్ ప్రైమ్ సర్వీసులకు ఇవి పోటీగా నిలుస్తున్నాయి .
* జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌‌ లిమిటెడ్ (జీహెచ్ఐ-ఏఎల్) బాండ్స్ జారీ ద్వారా సుమారు రూ.2,071 కోట్లను సమీకరిస్తోంది. జీఎమ్‌ ఆర్ గ్రూప్‌‌కు చెందిన జీహెచ్ఐఏఎల్ అంతర్జాతీయ మార్కెట్లో ఐదేళ్ల కాలపరిమితి గల బాండ్లకు 5.375 శాతం వార్షిక వడ్డీరేటును నిర్ణయించింది. ఏప్రిల్ 3న ఈ ఆఫరింగ్‌‌ను ప్రారంభించినట్లు జీహెచ్ఐఏఎల్ తెలిపింది. దీని ద్వారా సమీకరించిన నిధులను హైదరాబాద్‌ లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌‌ను విస్తరించడానికి వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. విమానాశ్రయ సామర్థ్యాన్ని ఏటా 3.4 కోట్ల ప్రయాణికులకు పెంచడానికి కూడా ఈ నిధులను ఉపయోగించుంటారు. బాండ్ల జారీని విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని, ఈ ఆఫర్ అంతర్జాతీయ బాండ్ మార్కెట్ల నుండి నిధుల సేకరణ తమ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని జీఎమ్ఆర్ గ్రూప్ కార్పోరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. తమ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చడానికి, అభివృధ్ధి కోసం నిధులను సేకరిం చడానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని అన్నారు .ఈ ఆఫర్‌ విజయవంతం కావడం జీఎమ్ఆర్ గ్రూప్‌‌పై ఇన్వెస్టర్లకున్న నమ్మకాన్ని, జీహెచ్ఐఏఎల్‌ రుణ సమీకరణ సామర్థ్యాన్ని తెలియజేస్తుందని చెప్పారు.
*శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు పట్టివేత
శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం వస్తున్న ఆర్టీసీ బస్సులో బొద్దాం వద్ద ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పోలీసులు బస్సు తనిఖీ చేశారు. బస్సు దిగువ భాగంలోని లగేజీ క్యాబిన్‌లో మూడు లగేజీ బ్యాగులతో నోట్ల కట్టలు ఉన్నట్లు రాజాం సీఐ గంట వేణుగోపాల్‌ గుర్తించారు. వెంటనే బస్సుతో సహా 23 మంది ప్రయాణికులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పాలకొండ డీఎస్పీ ప్రేమ్‌ కాజల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని బ్యాగులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మొత్తం తంతును చిత్రీకరించారు. మూడు లగేజీ బ్యాగుల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు తేలింది. నగదు లెక్కించే యంత్రాలను తీసుకువచ్చి లెక్కించే ఏర్పాట్లు చేశారు. బస్సులో రాజాం, పాలకొండ నియోజకవర్గాలను పర్యవేక్షించే వైకాపా కీలకనేత ఉండటంతో పట్టుబడిన నగదు వైకాపాకు చెందినదేనని భావించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
* బీజేపీ ఎంపీ హేమా మాలిని ఇవాళ ట్రాక్ట‌ర్ న‌డిపారు. యూపీలోని మ‌థుర లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గోవ‌ర్ద‌న్‌లో ఇవాళ హేమామాలిని రైతుల‌తో ముచ్చ‌టించారు. ఆ త‌ర్వాత ఆమె ట్రాక్ట‌ర్ న‌డిపారు. కొన్ని రోజుల క్రితం ఇదే ప‌ట్ట‌ణంలో.. గోధ‌మ పంట‌ను కూడా కోశారు. చేతిలో కొడ‌వ‌లి ప‌ట్టి ఆమె పంట‌ను కోసిన విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఎన్నిక‌ల వేళ చేరువ చేసుకునేందుకు ఆమె తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా హేమమాలిని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక్కడి ప్రజలు తనను స్వాగతిస్తున్నారని, అందుకు తాను గర్వపడుతున్నానని ఆమె పేర్కొన్నారు.
* ఏపీలో పసుపు-కుంకుమ పథకానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ప్రభుత్వ తరుపు లాయర్ కోర్టులో అందజేశారు. జనచైతన్య వేదిక వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
* అమరావతిపదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 15 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపులను ఏర్పాటుచేశారు.
* అమ్రోహ్‌లో ఇవాళ ప్ర‌ధాని మోదీ ఓ బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడారు. కాంగ్రెస్ తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఉగ్ర‌వాదుల‌కు త‌మ భాష‌లోనే స‌మాధానం ఇస్తే కొంద‌ర‌కి న‌చ్చ‌డం లేద‌ని మోదీ ఆరోపించారు. భార‌త్ త‌న శ‌త్రువుల‌ను ధ్వంసం చేస్తే, ఇక్క‌డ కొంద‌రు ఏడుస్తున్నార‌ని అన్నారు. ప్ర‌పంచ దేశాల ముందు పాకిస్థాన్ ఉగ్ర‌వైఖ‌రిని ఎండ‌క‌ట్టాల‌ని చూస్తుంటే, కొంద‌రు మాత్రం ఆ దేశానికి అండ‌గా మాట్లాడుతున్నార‌ని పీఎం మోదీ అన్నారు. జాయెద్ మెడ‌ల్‌తో అత్యున్న‌త పుర‌స్కారం అందించిన యూఏఈ దేశానికి మోదీ థ్యాంక్స్ చెప్పారు.
* లోక్‌సభ స్పీకర్‌, ఇండోర్‌ పార్లమెంట్‌ సభ్యురాలు సుమిత్రా మహాజన్‌ 17వ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుమిత్రా మహాజన్‌ ఇవాళ ప్రకటించారు. ఇండోర్‌ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆమె అడిగారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని ఆమె కోరారు. ఇండోర్‌ నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికలు మొదలుకొని 2014 సాధారణ ఎన్నికల వరకు ఆమె ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. ఈ నెలలో సుమిత్రా మహాజన్‌ 76వ పడిలోకి అడుగుపెట్టనుంది. వయసు రీత్యా ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిని పక్కన పెట్టిన నేపథ్యంలో సుమిత్రా మహాజన్‌ను కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
* కుప్వారా జిల్లాలోని హంద్వారా సెక్టార్‌లోని లచ్చంపురా ఏరియాలో పేలుళ్లు సంభవించాయి. 15 రాష్ట్రీయ రైఫిల్‌ క్యాంపులోని ఆయిల్‌ డిపో వద్ద సంభవించిన పేలుళ్లలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీకి చెందిన 92 బేస్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో సోఫియాన్‌ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి
* చెన్నైలో మార్కీ బ్రిటిష్‌ ఆటోమేకర్‌ ఎంజీ మోటార్‌ అత్యంత ఆధునిక సాంకేతికతతో తరువాత తరం ‘ఇస్మార్ట్‌’ కారును త్వరలో భారత్‌లో ప్రవేశ పెట్టబోతుంది. ఈ ఏడాది జూన్‌లో తొలి ఇంటర్నెట్‌ కారు విడుదల చేస్తున్నామని, చెన్నై సహా భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈ కారు అందుబాటులో ఉంచుతామని ఎంజీ మోటార్‌ సంస్థ ప్రకటనలో తెలిపింది.ఎంజీ హెక్టార్‌ ఇస్మార్ట్‌ పేరుతో ఈ కారులో ఎంఐఎం రకం సిమ్‌ పొందుపరు స్తారు. ఇది కారును ఇంటర్నెట్‌తో అనుసం ధానిస్తుంది. సిస్కో, ఎయిర్‌టెల్‌ భాగ స్వామ్యంతో కొత్త సాఫ్ట్‌ వేర్‌ తయారు చేశారు. ఎంజీ హెక్టార్‌లో 5జి నెట్‌వర్క్‌ ఆధారిత ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ వెర్షన్‌ 6 (ఐపీవీ6) కూడా అందుబాటులో ఉన్నట్లు ఎంజీ మోటార్స్‌ ఎండీ రాజీవ్‌ చాబా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
* వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కుప్పం అభివృద్ధి చెందిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ అన్నారు.
కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఇవాళ కుప్పంలో ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు. కుప్పంలో డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు లేవన్నారు. బాబు పాలనలో కుప్పం పూల రైతులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని జగన్ మండిపడ్డారు.
* ఈనెల ఆరో తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు, రాష్ట్ర స్థాయి ఉగాది వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ప్రభుత్వ పరంగా జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్రపునేఠ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఉగాది వేడుకలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తప్పక హాజరుకావాలని ఆదేశించారు.
*మాజీ ప్రధాని దేవెగౌడ తెదేపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల ఎనిమిదవ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో, కృష్ణాజిల్లాలోని తిరువూరు, పామర్రు, పెదన నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు.
*తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా గురువారం జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కోల్‌కతాకు బదిలీపై వెళ్లడంతో, జస్టిస్‌ చౌహాన్‌ను ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేయడం విదితమే. జస్టిస్‌ రాధాకృష్ణన్‌ గురువారం కోల్‌కతాలో, తెలంగాణకు సంబంధించి జస్టిస్‌ చౌహాన్‌ హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు.
*రైల్వే ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు, వారి సేవలను మెరుగుపరిచేందుకు ఆ శాఖ డిజిటలైజేషన్‌ను మరింత విస్తృతం చేసింది. వైద్యసేవలందించే ‘కైజాల’ మొబైల్‌ యాప్‌, ఈ-ఆఫీస్‌, ఉద్యోగులకు మెడికల్‌ గుర్తింపు కార్డుల సేవలను రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్యరైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌నిలయం నుంచి గురువారం ప్రారంభించారు.
*గుంటూరు నగరంలో తెదేపా నేత కోవెలమూడి రవీంద్రకు చెందిన కార్యాలయం పై గురువారం ఆద్యపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో తెదేపా నేతల కార్యాలయాల పై ఐటీ అధికారులు దాడులు చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.
*రాష్ట్రంలో అధికార తెదేపా ప్రధాన ప్రతిపక్షం వైకాపా ఎన్నికల మేనిపెస్తోలను శనివారం ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. తెదేపా మేనిఫెస్టోను ఆపార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించానుండగా వైకాపా మేనిఫెస్టో ఆ ఆపార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెల్లడించనున్నారు. శుక్రవారమే మేనిఫెస్టో విడుదల చేయడం పై కూడా వైకాపాలో చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
*టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన అభిమానులతో వ్యవహరించే తీరే వేరుగా ఉంటుంది. భద్రతా సిబ్బందిని దాటుకుని తన కోసం ఎదురు చూస్తున్న ఓ చిన్నారిని దగ్గరికి పిలిచి ముచ్చట్లు చెప్పినా.. అది ధోనీకే చెల్లింది. తాజాగా ఆటను ముంబాయి ఇండియన్స్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయినా ధోనీ తన కోసం ఓ పెద్దావిడ ఎదురు చూస్తున్న విషయం తెలుసుకుని వెనక్కి వచ్చాడు.
* ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నీలో గాయాలు అనేవి భాగమే దీని గురించి మేం పెద్దగా చింతించలేదు. ఎందుకంటే ప్రతి జాతూ ఇందుకు తగ్గట్టే ప్రణాలికలు రచిస్తాయి. కానీ కీలక ఆటగాళ్ళకు గాయాలు అయ్యాయని బాధపడుకుండా ముందుకెళ్ళడం ముఖ్యం.
*శ్రీలంక ఫస్ట్ బౌలర్ లసిత్ మలింగా అనుకున్నట్లే ఐపీఎల్ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు. ముందు మలింగకు ఐపీఎల్ లో ఆడేందుకు అనుమతిచ్చిన శ్రీలంక బోర్డు తాజాగా దేశవాళీ టోర్నీ కోసం అతడిని స్వదేశానికి రమ్మని సంగతి తెలిసిందే.
*ఓటర్ల జాబితాలో తన పేరుతో ఉన్న మూడు ఓట్లలో రెండింటిని తొలగించాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది దరఖాస్తు చేశారు.
*త్రైమాసిక పెన్షన్‌ వద్దనుకున్నప్పుడు పాలసీ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. అయితే ఇప్పటివరకు పెన్షన్‌ చెల్లించినందున ఎలాంటి వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.
*రుణ బకాయి చెల్లింపు జరిగిన తర్వాత కూడా సంబంధిత పత్రాలను వాపసు ఇవ్వకపోవడం సేవాలోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తేల్చిచెప్పింది. బాధితుడికి పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని ఎస్‌బీఐని ఆదేశించింది.
*పీజీ వైద్యవిద్య డిగ్రీ, డిప్లొమా సీట్ల తొలివిడత ప్రవేశాలకు ఈ నెల 5 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
*ఇంటర్మీడియట్‌ ఫలితాలపై వాట్సాప్‌లో వస్తున్న వదంతులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మొద్దని తెలంగాణ ఇంటర్‌ బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు చిహ్నాలు, అధికారుల సంతకాలను ఉపయోగించి కొందరు తప్పుడు ప్రకటనలను విడుదల చేస్తున్నారన్నారు.
*తెలంగాణకు ఎల్‌నినో గండం పొంచి ఉందా? అంటే ఉందనే చెబుతోంది వాతావరణాన్ని అంచనా వేస్తున్న స్కైమెట్‌ సంస్థ. రాష్ట్రంలో జూన్‌ మొదటివారంలో విస్తరించనున్న నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపితే ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదని ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
*త్వరలో జరగనున్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి ఫిర్యాదు చేసింది.
* అన్ని పాఠశాలల్లో సంగీతాన్ని తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అన్ని గురుకులాల్లో 4 నుంచి 12 తరగతుల్లో దీనిని అమలు చేయాలని చెప్పారు.
*నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల తొలిదశ పరిశీలనకు రాజకీయపార్టీలను అనుమతించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్‌ నిరంజన్‌..రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కోరారు.
*దేశ రాజకీయ యవనికపై బాబు జగ్జీవన్‌రామ్‌ చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దళితుల రాజకీయ సాధికారతకు కృషి చేశారని, అంబేద్కర్‌ తర్వాత ఎస్సీ, ఎస్టీల ప్రగతికి చోదకశక్తిలా నిలిచారని కొనియాడారు.
*‘‘పసుపు కుంకుమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే ప్రారంభించింది. ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే లబ్ధిదారుల గుర్తింపు కూడా జరిగింది. అందువల్ల ఆ పథకాన్ని నిలిపేసే ఉద్దేశం లేదు’’ అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
*రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలన్నీ నెరవేరాలని శ్రీశైలంలోని భువనేశ్వరి పీఠాధిపతి శ్రీకైలాసగిరి స్వామిజీ ఆశీస్సులు అందించారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, సుపరిపాలన కొనసాగాలని ఆకాంక్షించారు. గురువారం తన శిష్యులతో కలిసి అమరావతి సందర్శనకు వచ్చిన ఆయన ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీశైలంలోని అక్కమహాదేవి గుహలోని శంకరమఠంలో లోకకల్యాణం కోసం కైలాసగిరి స్వామిజీ కొంతకాలంగా యాగం చేస్తున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా శంఖబ్రత బాగ్చీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకూ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. శంఖబ్రత బాగ్చీ ప్రస్తుతం ఏసీబీలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకే డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
*పదో తరగతి పూర్తయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ నెల 7వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని శశి వేలివెన్ను క్యాంపస్‌లో ఐఐటీ జేఈఈ మెయిన్‌, నీట్‌లపై అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాలకు క్యాంపస్‌లోగానీ, 08819-242222 నంబరులోగానీ సంప్రదించాలని సూచించారు.
*ఏపీ డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(డీఈఈసెట్‌)ను మే 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ పార్వతి తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు ఈ నెల 22వ తేదీ వరకు అవకాశం కల్పించామని, మే 10నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.
*లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
*గుంటూరు నగరంలోని తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర(నాని)కు చెందిన కార్యాలయంపై గురువారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో తెదేపా నేతల కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ఆ పార్టీశ్రేణుల్లో కలవరం రేపుతోంది.
*2018-19 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల వసూళ్లకు సంబంధించి మన రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యం రూ. 50 వేల కోట్లు కాగా దానిలో రూ. 49,700 కోట్లు వసూలు చేశామని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ కస్టమ్స్‌ అధికారి హరేరామ్‌ తెలిపారు. గురువారం విశాఖలో ఆయన మాట్లాడారు. జీఎస్‌టీ రెవెన్యూలో కూడా ఆశించిన ఫలితాలను సాధించామన్నారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ రసవత్తర పోరుకు సిద్ధమవుతోంది. ఈ లోక్‌సభ స్థానం నుంచి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా సతీమణి పూనమ్‌ సిన్హా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి, భాజపా మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేయనున్న నేపథ్యంలో ఆయనపై ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని విపక్ష ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించాయి. కాంగ్రెస్‌ మద్దతు తెలపనుంది. యూపీలో ఎస్పీ, బీఎస్పీలకు కాంగ్రెస్‌ వదిలిపెట్టిన ఏడు స్థానాలలో లఖ్‌నవూ ఒకటి. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థినిగా పూనమ్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఉమ్మడి అభ్యర్థిని నిలపటం ద్వారా రాజ్‌నాథ్‌ సింగ్‌కు గట్టి పోటీనిచ్చి ఆయనను ఎన్నికల ప్రచారంలో ఈ నియోజకవర్గానికే కట్టడి చేయాలన్నది విపక్షాల వ్యూహం.
* మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ చింద్వాడా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఇదే అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో కమల్‌నాథ్‌ పోటీ చేయనున్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ 12 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ ఇప్పటివరకు 369 స్థానాలకు అభ్యర్థుల జాబితాను వెల్లడించినట్లయింది.
* దిల్లీలో కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌)ల మధ్య పొత్తు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిని సర్దుబాటు చేసుకునే విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ బుధవారం సాయంత్రం ఏఐసీసీ ఇన్‌ఛార్జి పి.సి.చాకోతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వడానికి ఆప్‌ ముందుకురాగా, మూడు సీట్లు కావాలని ఆ పార్టీ అడుగుతోంది.
* వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఎన్నికల ప్రచారంలో మరో అపశ్రుతి జరిగింది. జగన్‌ రోడ్‌షో అనంతరం జరిగిన స్వల్ప తొక్కిసలాటలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విద్యుదాఘాతంలో ఒకరు మృతిచెందిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.