Food

ఉగది ప్రత్యేక వంటకం – అరటి పూరీ

banana puri special recipe for ugadi 2019

కావలసినవి: అరటిపండ్లు: రెండు, పంచదార: 4 టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి: అరటీస్పూను, గోధుమపిండి: ఒకటిన్నర కప్పులు, పెరుగు: టేబుల్‌స్పూను, బేకింగ్‌సోడా: పావుటీస్పూను, ఉప్పు: చిటికెడు, నెయ్యి: టేబుల్‌స్పూను, నూనె: వేయించడానికి సరిపడా

* ఓ గిన్నెలో అరటిపండ్ల గుజ్జు వేయాలి. అందులోనే పంచదార, జీలకర్రపొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ఓ గరిటెతో మెత్తగా అయ్యేలా కలపాలి. అందులోనే గోధుమపిండి, పెరుగు, నెయ్యి, బేకింగ్‌సోడా వేసి కలపాలి. పిండిముద్ద మరీ గట్టిగా ఉంటే మరికాస్త పెరుగు వేసి కలపాలి. చేతులకి కాస్త నెయ్యి రాసుకుని పిండిని మెత్తగా కలిపి మూతపెట్టి సుమారు ఎనిమిది గంటలపాటు నాననివ్వాలి. ఇందులో నీళ్లు అసలు పోయకూడదు.
* తరవాత ముద్దను చిన్న ఉండల్లా చేసి మందపాటి పూరీల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వేడిగానే కాదు, చల్లారినా కూడా బాగుంటాయివి.