?????????????????????????????????????
మిషన్ శక్తి వల్ల అంతరిక్షంలో ఏర్పడ్డ వ్యర్థాలు 45 రోజుల్లో మటుమాయం అయిపోతాయని డీఆర్‌డీవో చీఫ్ జి.సతీష్‌రెడ్డి వెల్లడించారు. నేడు డీఆర్‌డీవో అధికారులు మిషన్ శక్తి విశేషాలను మీడియాకు వెల్లడించారు. ఒక వేళ అంతరిక్ష యుద్ధం మొదలైతే భారత్‌పై శత్రువులు దాడి చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. సైనిక అవసరాల్లో కూడా అంతరిక్షానికి ప్రాధాన్యం ఏర్పడిందని వెల్లడించారు. భారత్ దేశం నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించే సత్తాను ప్రదర్శించిందన్నారు. శత్రువుల్లో భయం కల్పించడమే సరైన ఆత్మరక్షణ అని సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతకు ముందు విదేశంగ శాఖ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఏశాట్ ప్రయోగ వివరాలను వెల్లడించి.. దీని ద్వారా వచ్చే వ్యర్థాలు కొన్ని వారాల్లో గురుత్వాకర్షణ పరిధిలోకి చేరి మండిపోతాయని పేర్కొంది.
45 రోజుల్లో మాయం అవుతాయి
Related tags :