భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈరోజు నుండి సంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలుప్రారంభంకానున్నాయి. 15 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల కోసం భద్రాచలాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 10న ఉత్సవ అంకురారోపణం, 13న శ్రీ సీతారామచంద్రుల ఎదుర్కోలు ఉత్సవం, 14న శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీస్వామి వారి తిరుకల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు. 15న శ్రీరామ మహాపట్టాభిషేకం, రథోత్సవం నిర్వహించనుండగా, 20నబ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. శుక్రవారం వికారి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మూలవరులకు అభిషేకం చేయనున్నారు. నేడు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 20 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు.
భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
Related tags :