Politics

2019 ఏపీ ఎన్నికల్లో వైకాపా మేనిఫెస్టో ముఖ్యాంశాలు

ysrcp 2019 manifesto analysis

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి వైకాపా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నామని, మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా మేనిఫెస్టోను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, దీన్ని చూపించి 2021లో మళ్లీ ఓట్లు అడుగుతానని వెల్లడించారు. మేనిఫెస్టోలో మెజారిటీ అంశాలు నవరత్నాలే అని వివరించారు.

మేనిఫెస్టోలోని అంశాలివే..
రైతులకు..
* రైతుకు పెట్టుబడి కింద రూ.50 వేలు 
* పంటవేసే సమయానికి పెట్టుబడి కోసం మే నెలలో రూ.12,500
* పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంటరుణాలు, ఉచిత విద్యుత్‌, బోర్లు వేయిస్తాం. 
* ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు రూ.1.5లకే(యూనిట్‌) ఇస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంటు
* రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు 
* పంటవేసే ముందే ధరలు ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరలకు భరోసా
* రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి.
* ప్రతి నియోజకవర్గంలో గోదాంలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు
* మొదటి ఏడాది సహకార సంఘాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలుపోసే రైతుకు లీటరుకు రూ.4 బోనస్‌
* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ రద్దు. టోల్‌ ట్యాక్స్‌ రద్దు
* వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రైతులకు రూ.7 లక్షల బీమా. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం
* భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా రైతుల భూములకు రక్షణ కల్పించేలా చట్ట సవరణ
* కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. అన్ని ప్రయోజనాలు వారికి అందే వెసులుబాటు. నవరత్నాల్లోని అన్ని ప్రయోజనాలు వర్తింపు.
అందరికీ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ
* రూ.5 లక్షలు ఆదాయం దాటని అన్ని వర్గాల వారికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ వర్తింపు
* వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం
* ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఆరోగ్యశ్రీ.. ఏ నగరంలో చేయించుకున్నా వర్తింపు
* చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కుటుంబానికి చేయూత
* దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల పింఛను
* రెండేళ్లలో కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల సంఖ్య పెంపు
* అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను బడికి పంపితే రూ.15 వేలు
* ప్రస్తుత కార్పొరేషన్‌ వ్యవస్థ ప్రక్షాళన. పారదర్శక ప్రమాణాలు తీసుకొస్తాం.
* 45 ఏళ్ల వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేల ఆర్థిక సాయం
పింఛను రూ.3వేలు.. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌
* పింఛను రూ.3 వేలకు పెంపు. వికలాంగులకు రూ.3 వేలు పింఛను.
* పేదవారికి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం ఖర్చులు కూడా ప్రభుత్వ బాధ్యత
* కుల, మతం తేడా లేకుండా అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు 
* వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం
* పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి
* ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే గ్రామానికి చెందిన చదువుకున్న యువతకు పది ఉద్యోగాలు
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పింఛను వంటి సమస్యలు 72 గంటల్లోనే పరిష్కారం
* ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల
* ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బిల్లు 
* యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ
* ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకు వచ్చేలా చూస్తాం.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు 50 శాతం రిజర్వేషన్‌
మద్యపాన నిషేధం..అగ్రిగోల్డ్‌ బాధితులకు మేలు
* సున్నా వడ్డీకే రుణాల పథకాన్ని మళ్లీ తెస్తాం. పొదుపు సంఘాల వడ్డీ డబ్బు బ్యాంకులకు ప్రభుత్వమే కడుతుంది. 
* మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం.
* అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు. 13 లక్షల బాధితులకు మేలు చేస్తాం. మిగిలిన వారికి తక్షణం పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం. 
* తిరుమలలో యాదవులు గుడి తలుపులు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ 
* చనిపోయిన ప్రతి గొర్రెకు రూ.6 వేల బీమా
* సొంత ట్యాక్సీ నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు
* 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఏ పౌరుడికైనా వైఎస్‌ఆర్‌ జీవన బీమా పథకం కింద సహజ మరణమైనా లక్ష రూపాయలు అందజేత
* మాదిగ, రెల్లి, మాలలకు కార్పొరేషన్‌ ఏర్పాటు
* ఎస్సీ, ఎస్టీల యువతుల పెళ్లికి రూ.లక్ష
* గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు. అందులో విశ్వవిద్యాలయం, ఆస్పత్రి, కళాశాల ఏర్పాటు. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి
* ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు
* ప్రభుత్వ పాఠశాలలో చదువుల ప్రమాణాలు మార్చుతాం. ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధన.