2019 ఎన్నికల్లో తెదేపాకు తిరిగి పగ్గాలు అందించేందుకు తాము కూడా సాయపడతామని డెట్రాయిట్ ప్రవాసాంధ్ర మహిళలు ముందుకు వచ్చారు. ఆదివారం సాయంత్రం స్థానికంగా సమావేశమైన 40మందికి పైగా డెట్రాయిట్ ప్రవాసాంధ్ర మహిళలు 2019 ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా తమ కుటుంబీకులకు, స్నేహితులకు, సహచరులకు తెదేపా తరఫున విస్తృతంగా ప్రచారం చేయాలని తీర్మానించారు. చంద్రబాబు సారథ్యంలో నవ్యాంధ్ర సవ్యంగా దూసుకువెళ్తుందని రేపటి తరానికి నేటి ఓటు ఆవశ్యకతను తామంతా ప్రచారంలో ప్రధానాస్త్రంగా సంధిస్తామని వీరు పేర్కొన్నారు.
నారా విజయభేరీకై తరలిన డెట్రాయిట్ నారీ #NariForNarA
Related tags :