ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. పాత నేరస్థులు, రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారు. వీరిని నియంత్రించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో ముఖ్యమైన అంశం పాత నేరస్థుల బైండోవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలోనే ఈ సారి ఎక్కువగా బైండోవరు కేసులు నమోదయ్యాయి. మొత్తం 1539 కేసులు నమోదు చేసి 8,324 మంది పాతనేరస్థులు, రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు వీరిపై పోలీసుల పటిష్ఠ నిఘా ఉంటుంది. వీరు తిరిగి నేరాలకు పాల్పడితే వారు డిపాజిట్ చేసిన బైండోవరు నగదును జప్తు చేస్తారు. లైసెన్సుడు ఆయుధాల డిపాజిట్ల విషయంలోనూ జిల్లా ముందంజలో ఉంది. ఇప్పటి వరకు 227 మంది.. తమ ఆయుధాలను పోలీసులకు డిపాజిట్ చేశారు.
నల్గొండకు లేదు సాటి
Related tags :