వేసవిలో కొందరికి- ముఖ్యంగా చిన్నపిల్లలకి చెమట పొక్కులు రావడం చూస్తుంటాం. చర్మంమీద ఉండే రంధ్రాలు పూడుకుపోవడం, చర్మం రాపిడికి గురవడం… వంటి కారణాల వల్ల ఇవి వస్తుంటాయి. కొన్ని చిట్కాల ద్వారా వాటిని సులభంగా తగ్గించవచ్చు. అవేమంటే..
* గంధంచెక్కను సానమీద అరగదీసి దాన్ని ఆ పొక్కులమీద పూయడం వల్ల క్రమంగా తగ్గిపోతాయి.
* శుభ్రమైన బట్టను చల్లని నీళ్లలో ముంచి ఆయా భాగాల్లో ఉంచి ఓ నిమిషం తరవాత తీసేయాలి. ఇలా రోజుకి రెండుమూడుసార్లు చేయాలి.
* కీరాదోసముక్కల్ని మెత్తని ముద్దలా చేసి ర్యాష్ వచ్చిన భాగంలో రాసి పది నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా రోజుకి రెండు మూడుసార్లు చేస్తే కీరాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలవల్ల అవి త్వరగా తగ్గుతాయి.
* రోజుకోసారి తాజా అలోవెరా రసాన్ని ఆయా భాగాలకు పట్టించి ఓ పావుగంట తరవాత కడిగేసినా అవి త్వరగా తగ్గుతాయి. ఇవి చేయడంతోబాటు పిల్లల్ని సాధ్యమైనంతవరకూ ఎండలోకి తీసుకెళ్లకపోవడం, మెడల కిందా చంకల్లోనూ చల్లని నీళ్లతో తుడవడం, గాలి ఆడేలా పలుచని దుస్తులు వేయడం, చిక్కని లోషన్లూ క్రీములూ రాయకపోవడం… వంటి జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో చెమట పొక్కులు రాకుండా ఉంటాయి.
ఎండల ఎలర్జీలు పోయేదెలా?
Related tags :