ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పునిచ్చే అవనిగడ్డ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపించబోతున్నారు. తెలుగుదేశం, వైకాపా మధ్య పోటీ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తెదేపా అభ్యర్ధి, డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ముందంజలో ఉన్నరు. కొత్తగా రంగంలోకి వచ్చిన జనసేన నుంచి ముత్తంశెట్టి కృష్ణారావు బరిలో ఉన్నారు. మరిసింహాద్రి రమే్‌శ బాబు వైసీపీ నుంచిశ్రీకాకుళాంధ్రుడు కొలువైయున్న అవనిగడ్డపై జెండా పాతేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దివిసీమగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో త్రిముఖపోటీ నెలకొంది. ఉపసభాపతిగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడైన మండలి బుద్ధప్రసాద్ టీడీపీ తరఫున…
**1962లో ఏర్పడిన అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ ఆరు సార్లు గెలుపొందాయి. యార్లగడ్డ శివరామప్రసాద్, మండలి వెంకటకృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ, అంబటి బ్రాహ్మణయ్య, సైకం అర్జునరావు, సనకా బుచ్చికోటయ్యలాంటి ప్రముఖులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఇప్పటికి ఈ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన మండలి.. 2014లో టీడీపీలో చేరి వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్‌పై 5958 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి వీరిద్దరూ బరిలోకి దిగారు. వీరితోపాటు జనసేన నుంచి ముత్యంశెట్టి కృష్ణారావు కూడా బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో కాపుల సంఖ్య అధికంగా ఉండడంతో మూడు పార్టీలు అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దింపాయి. దీంతో పోరు హోరాహోరీగా మారింది. ఇప్పటికే మూడు పార్టీల అధ్యక్షులూ నియోజకవర్గంలో పర్యటించారు.
****మొత్తం ఓట్లు 2,00,677
కాపులు 69,876
మత్స్యకారులు 25,322
ఎస్సీ 36,608
గౌడ 19,100
కమ్మ 14,054
యాదవ 10,564
వైశ్య 4,500
రజక 3,600
ఇతరులు 17,053
***సింహాద్రి రమేశ్‌బాబు (వైసీపీ) బలాలు
రెండు పర్యాయాలు ఓటమి చెందడంతో సానుభూతి
పాత కమ్యూనిస్టులతో ఉన్న సత్సంబంధాలు
యువతను ఎక్కువగా ఆకర్షించటం.
*బలహీనతలు:
ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తులు
పార్టీకి అండగా ఉంటారనుకున్న
శివరావు రెబల్ అభ్యర్థిగా నిలబడడం
****మండలి బుద్ధప్రసాద్ (టీడీపీ) బలాలు
బలమైన టీడీపీ కేడర్
పట్టిసీమ ద్వారా సాగునీరు అందించటం
ఘంటసాలలో వ్యవసాయ
పాలిటెక్నిక్ కళాశాల మంజూరు
పార్టీలకతీతంగా సహాయమందించటం
*బలహీనతలు:
ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అనైక్యత
కార్యకర్తలతో మమేకం కాలేకపోతున్నారన్న ఆరోపణలు
*ముత్తంశెట్టి కృష్ణారావు (జనసేన) బలాలు
తెలుగుదేశంలోని ద్వితీయశ్రేణి నాయకులతో సంబంధాలు
నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన
ప్రజాసమస్యల పట్ల చేసిన పోరాటాలు
*బలహీనతలు
ఎన్నికల సమయంలోనే కనబడతారన్న ఆరోపణలు
స్థానికేతరుడు కావడం