కథానాయిక రెజీనా ఓ కథానాయకుడితో ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులపై రెజీనా తాజాగా స్పందించారు. డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ‘నేను నా సహ నటుల్లో ఒకరైన వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్ని చూశా. ఇవన్నీ ఆధారాలు లేకుండా రాసినవి. నా జీవితంలో ప్రస్తుతం నాకు ఎవరి మీదైనా ప్రేమ ఉందంటే అది నా వృత్తిపైనే. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మీకు నేనే చెబుతా. ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది’ అని రెజీనా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెజీనా ‘అ!’ సినిమా తర్వాత తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దీని తర్వాత ఆమె తమిళంలో బిజీ అయ్యారు. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె హిందీలో నటించిన ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమా విడుదలైంది. ఇందులో సోనమ్ కపూర్, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
వృత్తిపైన ప్రేమ
Related tags :