NRI-NRT

వంగూరి ఫౌండేషన్ ఉగాది ఉత్తమ రచనల విజేతలు వీరే

vanguri foundation ugadi 2019 winners list

‘వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ నిర్వహించిన ఉగాది ఉత్తమ రచనల పోటీలో పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగు రచయితల నుంచి విశేష స్పందన లభించినట్లు ఫౌండేషన్‌ అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజు తెలిపారు. అమెరికాతో పాటూ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, సింగపూర్‌ తదితర దేశాల్లో నివసిస్తున్న రచయితలు పోటీలో పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఫౌండేషన్‌ అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజు ప్రకటించారు. ఉత్తమ కథానికల విభాగంలో మల్లికేశ్వరరావు కొంచాడ (మెల్‌బోర్న్‌) రచన ‘గుండెకోన’, శేషుశర్మ(అట్లాంటా) రాసిన ‘రుణానుబంధం’, రాధికా నోరి (ఫ్లారిడా) రచించిన ‘ఆత్మారామం’, రేష్మా మహమ్మద్‌ (ఫ్రెమోంట్‌) రచన ‘తిరంగాప్యార్‌’లు బహుమతులు గెలుచుకున్నాయి.ఉత్తమ కవితల విభాగంలో ‘చినుకు’ రచయిత రాపోలు సీతారామరాజు (జొహాన్నెస్‌బర్గ్‌), ‘మలుపు’ రచయిత్రి ఇంద్రాణి పాలపర్తి (హ్యూస్టన్‌), ‘అర్థంకాదు’ రచయిత రమాకాంత్‌ రెడ్డి(మెల్‌బోర్న్‌)లు విజేతలుగా నిలిచారు.‘నా మొట్టమొదటి రచనా విభాగం’లో ‘క్షణం-క్షణికం’ రచయిత ఫణిరాజేష్‌(జపాన్‌), కాలం కలం పట్టినవేళ రచయిత్రి సావిత్రి తాడికొండ(న్యూజెర్సీ)లు విజేతలుగా నిలిచారు. ‘నా మొట్టమొదటి కథ’ విభాగంలో రాధికా మంగిపూడి(సింగపూర్‌) రచించిన ‘నిజాలెవరికి కావాలి’, మందడి శ్రీకాంత్‌(జొహాన్నెస్‌బర్గ్‌) రాసిన ‘ఎవరు హీరో’లకు బహుమతులు లభించాయి.