తూర్పు నియేజకవర్గంలో గద్దె ప్రజల అనురాగాన్ని సంపాదించారు,ఎంతవరకు అంటే దేవినేని నెహ్రూకి తూర్పు సీటు ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు.కాని తూర్పులో గద్దె రామ్మోహన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో దేవినేని అవినాష్ కి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి గుడివాడ సీటు ఇచ్చారు.ఇక్కడే చిక్కు వచ్చింది. తూర్పులో మంచిపట్టు ఉన్న దేవినేని అవినాష్ గుడివాడలో పాగవేయడానికి సిద్దంగా లేరని విశ్వసనీయ వర్గాల బోగట్టా. గుడివాడ సీటు గెలిచి చంద్రబాబు మనస్సు గెలిచి తూర్పుకు రావాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.ఇక్కడ గద్దె రామ్మోహన్ ఓడిపోతే 2024కి దేవినేని అవినాష్ కు సీటు దక్కే అవకాశం ఉందని ఆయన అనూకూలవర్గం భవిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు దేవినేని వర్గం గద్దెకు ఎంతవరకు సహకారం అందిస్తారో చూడాలి. బోప్పన భవన కుమార్ తెలుగు దేశం వ్యతిరేకతను ఆధారం చేసుకోని అన్ని వర్గాలను కలుపుకుపోతు, వైరివర్గాల వైరుధ్యాన్ని విజయంగా మలుచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. చూద్దాం ఆఖరు గంటలో కూడా ఫలితాలు తారుమారు కావచ్చు.ఓటరు కూడా డిసైడ్ అయ్యారు.ఊరికే ఓటు ఏందుకు ఓటు వేయాలి అని కాని ఓటరుకు తెలియదు తన బతుకు మార్చేది ఓటే అని.
బెజవాడ తూర్పులో రాజకీయ రంగులరాట్నం
Related tags :