ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకు తమ పార్టీ మద్దతిస్తుందని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ రాజకీయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు డిపాజిట్ రాకుండా ఓడిపోతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ అన్నారు. విద్యుత్ సరఫరాలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. ఇవాళ విద్యుత్ ఉంటే వార్త కాదని.. పోతే వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలనే డిమాండ్ ఉందని.. దీనిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో విడుదల చేస్తామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా మాకు సమ్మతమే
Related tags :