వేసవి సెలవుల్లో రద్దీ దృష్ట్యా వారాంతంలో సిఫార్సు లేఖలు స్వీకరించరాదని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుంది. సాధారణంగా వేసవి సెలవుల్లో భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో.. ప్రొటోకాల్ పరిధిలోని వారికి మినహా ఇతరులకు శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు జారీ చేయరాదని, ఇందుకోసం సిఫార్సు లేఖలు సైతం స్వీకరించరాదని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 16 నుంచి జులై 14వ తేదీ వరకు అమలు చేయనుంది.
2. కైరుప్పలలో పెద్ద పిడకల సమరం
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పెద్ద పిడకల సమరాన్ని (పెద్ద నుగ్గులాట) కారుమంచి రెడ్డి నంద కిషోర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకకు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వేల మంది హాజరయ్యారు. గ్రామస్థులంతా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. ఈ సమరంలో 32 మందికి గాయాలయ్యాయి.
3. అశ్వ వాహనంపై విహరించిన దేవదేవులు
భూలోకకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల చివరి రోజు ఆదివారం దేవదేవులైన శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్లు అశ్వ వాహనంపై విహరించారు. ఈవో శ్రీరామచంద్రమూర్తి, ధర్మకర్త పాటిల్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ఎం.మల్లికార్జునస్వామి, వేదపండితులు ఉదయం 7.30 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధనలు, జపానుష్ఠానాలు, కలశార్చనలు, రుద్రహోమం, చండీహోమం, జయాదిహోమం, 9 గంటల నుంచి పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృధం, త్రిశూలస్నానం, వసంతోత్సవం నిర్వహించారు. మల్లికాగుండం వద్ద స్థానాచార్యులు ఎం.పూర్ణానంద ఆరాధ్య చండీశ్వరునికి పసుపు,కుంకుమ,గంధంతో అవబృధ క్రతువులు జరిపి మంగళహారతులు ఇచ్చారు. అర్చక సిబ్బంది చండీశ్వరునికి మల్లికాగుండంలో శాస్త్రోక్తంగా స్నానాది క్రతులు నిర్వహించారు.సాయంత్రం అక్కమహాదేవి అలంకారమండపంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల చివరి రోజును పురస్కరించుకొని భ్రమరాంబాదేవి భక్తులకు నిజరూప అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు,వేదపండితులు ధూప దీప, నైవేద్యాలు సమర్పించి దేవదేవులకు విశేష పూజలు జరిపారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయంలో స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించారు. చివరగా శ్రీస్వామిఅమ్మవార్లకు ఏకాంత సేవ జరిపి ఉత్సవాలకు ముగింపు పలికారు.
4. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ ఈరోజు సోమవారం 08-04-2019 ఉదయం 5 గంటల సమయానికి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ …… శ్రీ వారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది.. నిన్న ఏప్రిల్ 7 న 90,639 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:2.29 కోట్లు.
5. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 8 బంకించంద్ర ఛటర్జీ
1846 : సిద్ధ కవి, పండితుడు దాసు శ్రీరాములు జననం (మ.1908).
1894 : వందేమాతరం గీత రచయిత, బంకించంద్ర ఛటర్జీ మరణం (జ.1838).
1904 : బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జననం (మ.1989).
1938 : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ జననం .
1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడిక పై సంతకాలు చేశాయి.
1857: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే మరణం (జ.1827).
1977 : మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం (జ.1914).
1983 : అల్లు అర్జున్ జననం.
1984 : ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ జననం.
2013 : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ మరణం (జ.1925).
6. శుభమస్తు
తేది : 8, ఏప్రిల్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న సాయంత్రం 3 గం॥ 59 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 13 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(నిన్న ఉదయం 8 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 41 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 10 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 38 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 20 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 31 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : మేషము
తిరుమలలో వీఐపీల దర్శనాలపై అంక్షలు

Related tags :