అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్ర సెనెట్ (విధానమండలి) ఏప్రిల్ 8, 2019 తారీఖు మధ్యాన్నం 2:23గం కు హర్షద్వానాల నడుమ తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానం ఆమోదించింది. కాలిఫోర్నియా 16వ జిల్లా “బేకర్స్ ఫీల్ద్” సెనెట్ సభ్యురాలు, సెనెట్ మైనారిటీ నాయకురాలు అయిన “షేనన్ గ్రొవర్” ఈ తీర్మానాన్ని కాలిఫోర్నియా రాజధాని నగరమైన శాక్రమెంటో లో జరిగిన సెనెట్ సభలో చదివి వినిపించారు. అనంతరం సెనెట్ సభ్యులు 38 మంది తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానంను తమ హర్షధ్వానాలతో ఏకగ్రీవంగా ఆమోదించారు. సెనెట్ ఆవరణలో ఉన్న “షేనన్ గ్రొవర్” తన కార్యాలయంకు విచ్చేసిన స్థానిక శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) కార్యవర్గ సభ్యులు, మరియూ సిలికానాంధ్ర స్థానిక సభ్యులైన తెలుగు వారందరికీ స్వయంగా స్వాగతం పలికారు. తదనంతరం ఆమె తన కార్యాలయంలో వారందరికీ అభినందన పత్రాలను అందజేసారు. అనంతరం టాగ్స్ ప్రతినిధులు, స్థానిక తెలుగు వారిని ఆమె తెలుగు సంసృతిని గూర్చి అడిగి తెలుగుకున్నారు. కాలిఫోర్నియా రాస్ట్రంలో లక్షమందికి పైగా తెలుగువారు నివాసం ఉంటున్నారు అని, దాదాపు 2000 మందికి పైగా విద్యార్ధులు కాలిఫోర్నియాలో ఉన్న సిలికానాంధ్ర మనబడి తరగతుల్లో తెలుగు భాష నేర్చుకుంటున్నారు అని, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 10,000 ఉంటుందని, స్థానిక శాక్రమెంటో నగరంలో 150 మంది విద్యార్ధులు టాగ్స్ సౌజన్యంతో తెలుగు అభ్యసిస్తున్నారు అని ఆమెకు టాగ్స్ ప్రతినిధులు వివరించారు. ఉగాది పండుగ గురించి వారు ఆమెకు వివరించారు. తదుపరి సమావేశంలో తప్పకుండా తను చీర ధరించి వస్తానని ఆమె పేర్కొన్నారు. కాలిఫోర్నియా సెనెట్ (విధానసభ) తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానం ఆమోదించడం మంచి పరిణామంగా టాగ్స్ అభివర్ణించింది. కాలిఫోర్నియా సెనెట్ లో ఆమోదింపబడ్డ తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానం కార్యక్రమంలో టాగ్స్ కార్యవర్గ సభ్యులు మరియూ సిలికానాంధ్ర స్థానిక సభ్యులు కృష్ణ బాచిన , నాగ్ దొండపాటి, వెంకట్ నాగం, మోహన్ కాట్రగడ్డ, మనోహర్ మందడి, శ్రీనీల మండవ, సౌమ్య వీరవట్నం, దీప్తి గోగినేని, లీల సీతల, రమ్య వీరవట్నం, స్వప్న మర్రి, శాంతల గెల్లి, నవ్య దొడ్డిపట్ల, శ్రీకాంత్ దాసరి, ఆనంద్ మాగంటి, సాగర్ ఈల్ల తదితరులు ఉన్నారు.
తెలుగు ఉగాది తీర్మానానికి కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం
Related tags :