చలసాని హత్య కేసులో తీర్పు వెల్లడి – 22 నేర వార్తలు – 04/09
*తెదేపా మాజీ ఎమ్మెల్యే చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ పండు హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు ఇచ్చింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేందర్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. డబ్బు కోసమే హతి చేసినట్లు మహేందర్ కోర్టుకు వెల్లడించారు. కాగా 2010లో హైదరాబాద్ లో వెంకటేశ్వరరావు దారుణహత్య కు గురయ్యారు. యూసఫ్ గూడలోని మధురా నగర్ లో ఓ అపార్ట్ మెంటులో ఆయనను చంపేశారు.
* అనంతపురం తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ నాయకుల ప్రచారహోరు టీడీపీ వాళ్లకు పర్మిషన్ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదంటూ పోలీసులతో వైసీపీ నాయకుల వాగ్వాదం వారినొక వైపు పంపిన పోలీసులు పరిస్థితి ఉద్రిక్తత0ఓఎస్డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో భారీగా మోహరించిన కేంద్ర బలగాలు
*ఇన్ కంటాక్స్ ఆఫీసర్నని చెప్పి మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామని చాదర్ ఘాట్ పోలీసులు చెప్పారు. తానూ ఇన్ కంటాక్స్ ఆఫీసర్ నని , అకౌంటెంట్ జనరల్ గా చెప్పుకుంటూ సిరాజ్ అహ్మద్ జనాల నుంచి డబ్బులు దండుకున్నా దాన్నాడు. జీఎస్టీ కమీషనర్ తనకింద పని చేస్తాడని తానూ ఉద్యోగాలిస్తాన్ని పలువురిని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో మెహదీపట్నంలో ఉంటూ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు ఆపి ఎస్ వోటీ పోలీస్ ల పేరుతొ సీబీఐ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా తనిఖీలు చ్స్తున్నామని వాహనదారులు నుంచి తొమ్మిది లక్షలు కాజేసినట్లు వివరించారు. మూడు నెలలు జైలుకు వెళ్లి వచ్చిన తరువాత తన మకాం మలక్ పేట కు మార్చడన్నారు.
* హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రావి నారాయణరెడ్డి నగర్‌లో భర్తను భార్య హత్య చేసింది. అనంతరం నిందితురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* ఆర్‌ఎస్‌ఎస్ నేత చంద్రకాంత్ శర్మపై.. కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేశారు. కిస్త్‌వార్‌లోని హాస్పటల్లో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. హాస్పటల్లో శర్మ మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆ దాడి వల్ల శర్మ గాయపడ్డాడు. చంద్రకాంత్‌కు సెక్యూర్టీ గార్డుగా పనిచేస్తున్న పోలీసులు ఆ దాడిలో మృతిచెందాడు. గన్‌తో హాస్పటల్లోకి వచ్చిన ఓ వ్యక్తి చంద్రకాంత్‌తో పాటు పోలీసుపై కాల్పులు జరిపాడు. కిస్త్‌వార్‌లో గత ఏడాది కూడా ఇలాంటి దాడి ఘటనే చోటుచేసుకున్నది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ పారిహర్, అతని సోదరుడు అజిత్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరూ చనిపోయారు.
*నిఘా విభాగం డీజీ బాద్యతల నుంచి ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం బదిలీ చేసినా ఆ విభాగం అధికారులు ఇప్పటికీ ఆయనకే నివేదిస్తున్నారు అనడానికి ఆధారాలేమితని వైకాపా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డిని హైకోర్టు ప్రస్నిమ్చింది. పత్రిక కధనాల ఆధారంగా వ్యాజ్యం వేస్తె తాము ఎలా జోక్యం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యం పై మంగళవారం ఉత్తర్వ్యులు వెలువడే అవకాశం ఉంది.
*వయనాడ్ లోక్ సభ స్థానానికి ఈ నెల 23న జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలని రైతులు ఇక్కడి తోటల్లో పని చేసే కార్మికులకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈమేరకు ముందక్కేలో వారి పేరిట పోస్టర్లు బ్యానర్లు వెలిసాయి. దీనిపై వయనాడ్ జిల్లా పోలీస్ అధికారి ఆర్.కురుప్ప స్వామీ మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు.
*లోక్ సభ శాసన సభకు ఈనెల పదకొండున ఎన్నికలు జరగనున్నందున హైకోర్టు తో పాటు రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలకు సాధారణ సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్త్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాద్ రాయ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మ సంబరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పటికే సెలవు ప్రకటించిన సెప్టెంబరు 28న (సనివారం)హైకోర్టు పని చేస్తుందని పేర్కొన్నారు.
*హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం భారతీయ జనతా పార్టీ నేతలకు చెందిన ఎనిమిది కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు నారాయణ గూడ ప్లై ఓవర్ దగ్గర మాటు వేసారు. బీ ఎన్ రెడ్డి నగర్ కు చెందిన తోటిరేడ్డి ప్రదీప్ రెడ్డి కవాడీగూడకు చెందిన కారు డ్రైవర్ గూడ శంకర్ కారులో హిమాయత్ నగర్ వై. జంక్షన్ వైపు నుంచి వెళ్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి వాహనాన్ని తనిఖీ చేశారు.
*ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ ఉమాదేవి రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమెకు సహకరించిన అటెండర్ జానీ, డాక్యుమెంట్ రైటర్ కపిల్‌లపై కేసు నమోదైంది.
* ప్రియుడి వేధింపులు భరించలేక బూర్ల సంధ్య(17) అనే యువతి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ ఓంకార్ యాదవ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లకు చెందిన సంధ్య తండ్రి బూర్ల రాజయ్య ఇటుక బట్టీలో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
*అనుమానస్పద స్థితిలో తల్లి, కూతురు మృతిచెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన తెలుగు సవరయ్య, జానకమ్మల కూతురు తెలుగు నిర్మల (35) పాలెం గ్రామానికి చెందిన తెలుగు నర్సింహకు ఇచ్చి పదేళ్ల కిందట వివాహం చేయగా, వీరిద్దరికి 8 ఏళ్ల సింధు అనే కూతురు ఉంది.
*కర్నూలులో రూ.65.65 లక్షలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నాలుగో పట్టణ సీఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా కోడుమూరు వైపు నుంచి సీఎంఎస్ సంస్థకు చెందిన వాహనం వచ్చింది. తనిఖీ చేయగా రూ.65.65 లక్షలు లభించింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
* చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్ పేటలో సోమవారం ఎన్నికల అధికారులు తెదేపాకు చెందిన సుబ్రమణ్యంరాజు ఇంటిలో రూ.74 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఓటర్లకు పంచడానికి అక్కడ నిల్వ చేశారనే సమాచారంపై ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇంటి పైభాగంలోని గదిలోని బీరువాలో ఉన్న రూ.500 నోట్ల కట్టలను అధికారులు శ్రీనివాసరావు, శివకుమార్ స్వాధీనం చేసుకున్నారు.
*హైదరాబాద్ నగరంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం భారతీయ జనతా పార్టీ నేతలకు చెందిన 8 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
*కర్నూలు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో నలుగురు గాయపడ్డారు. బనగానపల్లి నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్లలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి రోడ్‌షోకు హాజరయ్యేందుకు వెళ్తున్న తెదేపా కార్యకర్తలు, అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కేశవగౌడ్, రాజశేఖర్ లపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు.
*ఒక రైతు నుంచి రూ.2 లక్షలను డిమాండ్ చేసి..లంచంగా తీసుకుంటున్న ఇద్దరిని సోమవారం అవినీతి నిరోధక శాఖ పట్టుకొంది. రెవెన్యూ శాఖకు చెందిన ఆ నిందితుల్లో ఒకరు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట తహసీల్దార్ రవి రాజకుమార్‌రావు, మరొకరు వీఆర్‌ఏ రామకృష్ణ. ఇద్దరినీ రిమాండుకు తరలించామని అనిశా డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
*తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు చోరీ చేసిన దొంగను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
*ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్నాడని ఓ తండ్రి యువకుడిని కర్రలతో దాడి చేసి హత్య చేశాడు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఈ ఘటన జరిగింది.
*తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు చోరీ చేసిన దొంగను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
*సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో విజయశాంతి పాల్గొన్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీస్థాయిలో బాణసంచా పేల్చారు. పక్కనే ఉన్న కూలర్లు విక్రయించే దుకాణంలోని ఓ కూలర్‌పై ఈ టపాసుల నిప్పు రవ్వలు పడి మంటలు చేలరేగాయి. కార్యకర్తలు వెంటనే స్పందించి మంటల్లో ఉన్న కూలర్‌ను బయటకు తీసి ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది.
*ఉపాధి కోసం వచ్చి.. ఇటుక బట్టీలో పని చేస్తున్న ఓ కుటుంబంలో పిడుగుపాటు విషాదం నింపింది.రోజంతా పనిచేసి అలిసి పోయి నిద్రిస్తున్న వారిపై పిడుగుపడడంతో శాశ్వత నిద్రలోకి వెళ్లారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ విషాదం జరిగింది.
*లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. నారాయణగూడ పైవంతెన వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు వాహనంలోని రూ.8కోట్లు పట్టుకున్నారు. ఈ డబ్బంతా భాజపా ఫండ్‌గా పోలీసులు పేర్కొంటున్నారు.
చలసాని హత్య కేసులో తీర్పు వెల్లడి-నేరవార్తలు–04/09
Related tags :