Food

వేసవిలో దోసకాయ తిని తీరాలి

cucumber is good in summer

దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. వేసవికాలంతో పాటు అన్ని కాలాల్లోనూ, దీనితో అన్ని విధాలుగా చాలా ప్రయోజనాలున్నాయి. దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కార్బోనేటేడ్‌ ద్రావణాల కన్నా, దోసకాయ తినటం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉన్నందున కంటి వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం 15 నిమిషాల పాటు కళ్ళపై, తాజా దోసకాయ ముక్కలను ఉంచటం వల్ల మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్‌ దోసకాయలో ఉందని పరిశోధనల్లో తెలిసింది. మధుమేహంతో బాధపడేవారు దోసకాయ రసం తాగితే మంచి ఫలితాలు అందుతాయి. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టేరాల్‌ మూలకం దోసకాయలో ఉంటుంది. దీంతో సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దోసకాయ తింటే చర్మ సమస్యలు, ర్యాషెస్‌ తగ్గుతాయి. ఇందులో చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది.