జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఐఐటీ –మద్రాస్ మేటిగా నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ –బెంగళూరు ఐఐటీ –డిల్లి వరుసగా రెండు, మూడో స్థానల్లో నిలిచాయి. దేశంలోని పది అగ్రగ్రామీ విద్యా సంస్థల్లో ఏడు ఐఐటీలే కావడం విశేషం. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ మేరకు సోమవారం దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల ర్యాంకులు విడుదల చేసింది. దీని ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ .యూ) ఏడూ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పదో స్థానంలో నిలిచాయి. డిల్లి విశ్వ విద్యాలయానికి చెందిన మిరండా హౌస్ దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా విద్యార్ధుల మనసు చూరగింది. ఇదే విశ్వవిద్యలయానికి చెందిన సెయింట్ స్తేఫిన్స్ కళాశాల నాలుగో ర్యాంకును కైవసం చేసుకుంది. 2016 నుంచి కేంద్ర మనవ వనరుల మంత్రిత్వ శాఖ మన దేశంలోని విద్యా సంస్థలకు ర్యాంకింగ్ లు ప్రకటిస్తోంది.
ఐఐటీ–మద్రాస్ మేటి
Related tags :