Sports

హైదరాబాద్‌లో ఐపీఎల్ తుదిపోరు?-తాజావార్తలు-04/09

ipl 2019 final in hyderabad

ఐపీఎల్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లో..?– 27 తాజా వార్తలు – 04/09
* భాగ్యనగరంలో మరోసారి ఐపీఎల్ ఫైనల్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. పన్నెండో సీజన్ తుదిపోరుకు హైదరాబాద్ ను స్టాండ్బై వేదికగాఎంపిక చేస్తూ సోమవారం జరిగిన సీఓఏ సమావేశంలోనిర్ణయం తీసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్ గ్రౌండ్ అయిన చెన్నై చెపాక్ స్టేడియంలో ఫైనల్ జరగాలి. అయితే, చెపాక్‌ లోని మూడు స్టాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివాదం తేలకపోవడంతో సీఓఏ.. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ కు (టీఎన్‌ సీఏ) ఓ వారం గడువు ఇచ్చింది. వివాదం పరిష్కరించుకోకపోతే ఫైనల్‌ ను తరలిస్తారు. 2012 నుంచి జరుగుతున్న ఈ స్టాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో గతేడాది రన్నరప్‌ కు ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించే అవకాశం కల్పించారు. ఒక వేళ ఫైనల్‌ ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తే ప్లే ఆఫ్‌ , ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ లు బెంగళూరులో జరిగే అవకాశం ఉన్నట్టు సమచారం.వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళల ఐపీఎల్‌ మహిళల మినీ ఐపీఎల్‌ కు కూడా సీఓఏ సమావేశంలో లైన్‌ క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్టు తెలిసింది. మూడు జట్లు రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే టోర్నీకి ఆమోదం లభించింది. ఫైనల్‌ తో కలిపి మొత్తం నాలుగు మ్యా చ్‌ లు జరుగుతాయి. మ్యాచ్‌ లన్నీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతాయి. ఇందులో ఒకమ్యాచ్‌ వైజాగ్‌ లో నిర్వహించనుండగా మిగిలినమ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి.15న వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్ టీమ్ ఎంపిక ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఐసీసీ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఆడే టీమిండియాను ఈ నెల 15వ తేదీన ఎంపికచేయాలని సీవోఏ బోర్డుకు సూచించింది. మే 30వతేదీన ప్రారంభమయ్యే వరల్డ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఆడే జట్లను ఏప్రిల్‌ 23వ తేదీ లోపు ప్రకటించాల్సిఉంది. దీంతో తుది గడువుకు ఎనిమిది రోజుల ముందే 15మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించనున్నారు. అలాగే, ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌ ఏర్ పాటుకు సంబంధించి సీఓఏ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాల్లో అసోసియేషన్‌ ఏర్పాటు జరిగేలా నలుగురు సభ్యులకమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఇండియాలోజరిగే దేశవాళీ, ఇంటర్నేషనల్‌ టోర్నీలకు టైటిల్‌ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పేటీఏమ్‌ సంస్థతో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియనుండడంతో కొత్తగా టెండర్లు పిలవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
* టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్‌ చేయాలని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. దాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను ఏప్రిల్‌ 15వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు వెల్లడించింది. చైనాకు చెందిన వీడియో యాప్ .. పిల్ల‌ల్లో అశ్లీల (పోర్న్) ప్ర‌వృత్తిని పెంచుతోంద‌ని ఇటీవల మద్రాసు కోర్టు పేర్కొన్న‌ది. టిక్‌టాక్ యాప్‌లో ఉన్న వీడియోల‌ను వాడ‌రాదంటూ మీడియాకు కూడా ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిన్న చిన్న వీడియోలు తీసి, వాటికి స్పెష‌ల్ ఎఫెక్ట్స్ జోడించి.. టిక్‌టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ యాప్‌కు ఇండియాలో సుమారు 6 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు. అయితే టిక్‌టాక్ యాప్‌పై మ‌ద్రాసు హైకోర్టులోని మ‌ధురై బెంచ్ ఈ కేసును ప‌రిశీలిస్తున్న‌ది. టిక్‌టాక్ వాడుతున్న పిల్ల‌లు.. లైంగిక వేధింపుల‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కోర్టు చెప్పింది.
* హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పలు కిడ్నాప్‌లకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.18 లక్షల నగదు, రెండు కార్లు, నాలుగు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
* ఉత్తర్ ప్రదేశ్ లోని షాహజాన్ పూర్ లో ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. సంయుక్త్ వికాస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వైద్ రాజ్ కిషన్ పెళ్లి కొడుకు వేషాధారణలో గుర్రంపై వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. పెళ్లి మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత ఉంటుందని చెప్పారు. కిషన్ ర్యాలీని స్థానికులు ఆసక్తిగా చూశారు.
* కడప పెద్ద దర్గాను సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ దర్శించుకున్నారు. దర్గా నిర్వాహకులు ఆయనకు ముస్లిం సంప్రదాయంలో స్వాగతం పలికారు. అనంతరం పూల చాదర్‌ను చదివించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు దర్గా విశిష్టతను వివరించారు. దర్గాకు సాయిధరమ్‌ తేజ్‌ వచ్చారన్న వార్త తెలియడంతో ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం దర్గాకు తరలివచ్చారు.
* లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఆయన ఎన్నికల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యా ప్తంగా మొత్తం 34,604 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశామన్నారు. 6,445 స్టేషన్లను క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్నారు. నిజామాబాద్ పోటీలో నిలిచిన రైతుల సందేహాలను తీర్చామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ లను పంపామని, స్ట్రాం గ్ రూంలను పరిశీలిం చామన్నారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 2,97,08,599 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 2,96,95,548 మంది జనరల్ ఓటర్లు ఉండగా 1,49,18,315 మంది మగవాళ్లు, 1,47,75,729 మంది ఆడవాళ్లు ఉన్నారన్నారు. మిగతా ఇతరులు 1054 మంది, 11,320 మంది సర్వీస్ ఓటర్లు, 1731 మంది ఓవర్సీస్‌‌‌‌ ఓటర్లు ఉన్నారని చెప్పారు 96 శాతం ఎపిక్ కార్డు లు, 95 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న 80 శాతం మందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. 72 గంటల ప్రొటోకాల్ ప్రారంభించామన్నా రు. 15 తర్వాత జెడ్పీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
* హైదరాబాద్‌లో మరోసారి భారీగా నగదు పట్టుబడింది. నారాయణగూడలో రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే లంగర్‌ హౌస్‌లో మంగళవారం ఉదయం రూ.2.4 కోట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నగదును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
*నవనీత్ కౌర్ (22వ 5వ నిమిషాల్లో) రెండు గోల్ఫ్ తో సత్తా చాటి బహరత మహిళల హాకీ జట్టుకు ఓటమి తప్పించింది. మలేషియాలతో ఐదు మ్యాచ్ ల హాకీ సీరీస్ లో భాగంగా సోమవారం జరిగిన మూడో మ్యాచ్ ను భారత్ 4-1 గోల్ఫ్ తో డ్రా చేసుకుంది. భారత్ 4-4 గోల్ఫ్ తో డ్రా చేసుకుంది.
*గతేడాది ప్రో కబడ్డీ లీగ్ లో అడుగుపెట్టిన రైడర్ సిద్దర్ద్ దేశాయ్ కు జాక్ పాట్ తగలింది. ఏడో సీజన్ కోసం సోమవారం ఆరంభమైన వేలంలో తోలి రోజు తెలుగు టైటాన్స్ రూ.1.45 కోట్లు చెల్లించి అతన్ని కొనుగోలు చేసింది.
*ప్రధాని మోడీ బయోపిక్ చిత్రాన్ని ఇంతవరకు సెన్సార్ బోర్డు దృవీకరించ నందున ఈ దశలో ఆ సినిమా విడుదల పై స్తే ఇవ్వలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆ చిత్రం విడుదలకు సిలుపుదల చేయాలంటూ దఖాలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గోగోయ్, జస్టీస్ దీపక్ గుప్తా జస్టీస్ రంజన్ ఖంనలతో కూడిన ధర్మాసనం ఈమ్రకు వ్యాఖ్యానించింది. మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
*గత ఐదేళ్ళుగా మోడీ ప్రభుత్వ చర్యలు రైతులకు హానికరంగా ఉన్నాయని దేశ వ్యాప్త రైతు సంఘాల నాయకులూ సోమవారం ఆరోపించారు. ఈమేరకు భాజపాకు వ్యతిరేకంగా ఓటేయాలని 180 రైతు సంఘాలకు చెందిన రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్ రైతులందరికీ విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నరేంద్ర మోడీ కిసాన్ విరోధి పేరిట ఆర్కేఎం ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. డిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
*వీవీప్యాట్ల చీటీల లెక్కింపును పెంచాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేస్తామని ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. సుప్రీం ఆదేశాల్ని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని ఈసీ అధికార ప్రతినిధి తెలిపారు.
* ఓటింగ్‌ యంత్రాల్లో నమోదయ్యే చీటీల లెక్కింపును పెంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈవీఎంలకు అనుసంధానమయ్యే వీవీప్యాట్‌ యంత్రాల్లోని చీటీలను ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు బూత్‌ల్లో లెక్కించాలని స్పష్టం చేసింది.
*పోలీసు నియామకాలకు సంబంధించి ఇటీవల ముగిసిన దేహదారుఢ్య పరీక్షల్లో మొత్తం 1,17,660 మంది అభ్యర్థులు తదుపరి తుదిపరీక్షకు అర్హత సాధించారు. మొత్తం 18,428 ఉద్యోగాలకుగాను ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 2,24,741 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.
*యువ కథానాయకుడు నితిన్‌ జనసేన పార్టీకి రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. నితిన్‌ తండ్రి, నిర్మాత సుధాకర్‌రెడ్డి సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి చెక్‌ను అందించారు.
* భారతీయ వృత్తి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనమే నిజాం ఆభరణాలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. దిల్లీలో సోమవారం ‘జువెల్స్‌ ఆఫ్‌ ఇండియా- ద నిజామ్స్‌ జ్యువెలరీ కలెక్షన్‌’ పేరిట జాతీయ సంగ్రహాలయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు సందర్శించారు.
*తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడి ప్రజానీకం 40 రోజులకు పైగా వేచి ఉండాలి. అన్ని రోజులు కాకున్నా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల కోసం కూడా వారు ఎదురుచూడక తప్పదు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ 11వ తేదీన ముగిసిన తర్వాత- ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.
* ఏపీలో రైతులకు నాలుగో విడత రుణ మాఫీ సొమ్ము విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,900 కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు అందుబాటులో ఉంచింది. సుమారు 30 లక్షల మందికి ఈ విడతలో ప్రయోజనం కలగనుంది.
* రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో ఎండా వాన దోబూచులాడాయి. మిట్టమధ్యాహ్నం ఎండ మండుతున్న వేళ ఒక్కసారిగా చల్లని వాతావరణం ఏర్పడి జల్లులు కురిశాయి. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల వడగళ్లవాన కురిసింది. యాచారం మండలం మాల్‌లో పెద్దపరిమాణం గల వడగళ్లు పడ్డాయి.
*రాష్ట్రంలో యాసంగి సీజన్‌ పూర్తయి పంట ఉత్పత్తులు విక్రయాలకు వస్తున్న నేపథ్యంలో.. వ్యవసాయశాఖ అన్ని మార్కెట్ల కార్యదర్శులను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఏప్రిల్‌, మే నెలల్లో అధిక పరిమాణంలో ధాన్యం రాబడులు మార్కెట్‌ యార్డులకు వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అకాల వర్షాలు కురుస్తున్నందున, ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
*కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హృద్రోగంతో బాధపడుతున్న ఆయన ఈనెల 3న ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని..ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేర్‌ వర్గాలు వెల్లడించాయి.
*రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఆరు, ఏడు, పది తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష లను ఈ నెల 18న జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తారు. ఆరో తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు; ఏడు, పది తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలుంటాయని పాఠశాలవిద్య డైరెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 10 మొదలు ప్రవేశ పత్రాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.
* దక్షిణ మధ్య రైల్వేలో వివిధ ఇంజినీరింగ్‌ పనుల కారణంగా ప్రకటించిన ప్యాసింజర్ల రద్దు కాలాన్ని మరింత పొడిగించారు. ఆ మేరకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మణుగూరు-కాజీపేట మధ్య నడిచే 57657/58 నంబరు మణుగురు ప్యాసింజరు రైళ్లను 9వ తేదీ నుంచి నెలాఖరు వరకు రద్దుచేస్తున్నారు. 67245/46 నంబరు విజయవాడ-భద్రాచలం రోడ్‌ ప్యాసింజర్‌ రైలుబండ్లు కూడా 9 నుంచి 30వ తేదీ వరకు రద్దవుతున్నాయి. వీటిని డోర్నకల్‌-భద్రాచలం రోడ్‌ వరకు రద్దుచేస్తున్నారు. అంటే విజయవాడ-డోర్నకల్‌ మధ్య మాత్రమే నడుస్తాయి.ఈ రైళ్లు 9వ తేదీ నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా, మరింతకాలం పొడిగించారు.
*దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు విద్యాసంస్థలకు స్థానం దక్కింది. నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకులను సోమవారం దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడుదల చేశారు.
*జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ‘‘ఐఐటీ -మద్రాస్‌’’ మేటిగా నిలిచింది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ)- బెంగళూరు, ఐఐటీ -దిల్లీ వరుసగా రెండు, మూడోస్థానాల్లో నిలిచాయి. దేశంలోని పది అగ్రగామి విద్యాసంస్థల్లో ఏడు ఐఐటీలే కావడం విశేషం. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ మేరకు సోమవారం దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల ర్యాంకులు విడుదల చేసింది.
* అగ్రిగోల్డ్‌, అభయగోల్డ్‌, అక్షయగోల్డ్‌, సిరిగోల్డ్‌, ఎన్‌మార్ట్‌, బొమ్మరిల్లు, విఆర్‌ చిట్స్‌ల పాపం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ శేషసాయిబాబు అన్నారు. ఈ కుంభకోణాలన్నీ 2004-14 మధ్య జరిగాయని ఆయన చెప్పారు. తెదేపా అధికారం చేపట్టాక వీటిపై సీఐడీ కేసులు నమోదుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కుంభకోణాలన్నీ తెదేపా హయాంలో జరిగినట్లు మాట్లాడుతూ విజయమ్మ, జగన్‌, షర్మిల ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, ధైర్యముంటే ముందుకు రావాలని శేషసాయిబాబు సవాల్‌ విసిరారు. డిపాజిట్లు వసూలు చేసి ఎగ్గొట్టారన్న ఆరోపణలపై విశాఖ పశ్చిమ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌పై 2016లో కేసు నమోదైందన్నారు. అంతకుముందే అగ్నిప్రమాదం పేరుతో వెల్ఫేర్‌ గ్రూపు కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టారని ఆరోపించారు.
*పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి 12వ తేదీన ఆన్‌డ్యూటీ అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు పి.బాబురెడ్డి, జి.హృదయరాజు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యంను కలిసి వినతిపత్రం సమర్పించారు.
*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2019-2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తొలి విడత నిధులను విడుదల చేసింది. వేజ్‌ కాంపొనెంట్‌ కింద తొలి విడతలో భాగంగా రూ.1231.85 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.