DailyDose

దివిసీమలో ప్రవాసుల ప్రచారం-రాజకీయ-04/09

nris campaign in diviseema

* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ప్రవాసభారతీయుడు యార్లగడ్డ అరవింద్‌ తెలిపారు. న్యూజెర్సీలో స్థిరపడిన కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన ప్రవాసభారతీయులు శ్రీరామ్‌ ఆలోకం, చంద్రశేఖర్‌ కొండపల్లి, రాధాకృష్ణ నల్లమల, సత్య కొత్తపల్లి, రవి చిటిపోతు సోమవారం రామానగరంలో నిర్వహించిన తెదేపా తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిని పరుగులు తీయించడంలో ప్రపంచంలోనే దూరదృష్టి గల నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని తెలిపారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబునాయుడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసభారతీయులు తెదేపాకు మద్ధతుగా నిలిచి తోడ్పాటునందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ తెదేపాకి మద్ధతుగా నిలిచి అఖండ విజయానికి సహకరించాలని కోరారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకూ 20 నియోజకవర్గాల్లో పర్యటించామని.. రైతులకు, పింఛనుదార్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటునందించిందని తెలిపారు.
*భద్రాచలం మాదే – చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఖమ్మం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డంకి కాదన్న కేసీఆర్.. ప్రాజెక్టు కారణంగా భద్రాచలం మునిగిపోతుందని అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. భద్రాచలాన్ని, రాముడిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని అన్నారు. ఒకప్పుడు భద్రాచలం ఏపీలోనే ఉండేదని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.భద్రాచలాన్ని తమకిస్తే భద్రంగా చూసుకుంటామన్నారు. సాగర్, శ్రీశైలంలను నియంత్రణలో ఉంచుకున్న మీకు పోలవరంలో వాటా కావాలా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెత్తందారీ పాలన తమ వద్ద సాగదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేసీఆర్, జగన్‌లు ముసుగు తీసేశారని అన్నారు. కేసీఆర్ వేసే బిస్కెట్లకు జగన్ తోక ఊపుతున్నారని అన్నారు.
*భద్రాచలం గురించి అప్పట్లో ఎందుకు మాట్లాడలేదు.
భద్రాచలం ప్రాంతాన్ని తమకు వెనక్కు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేయడంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యంగా స్పందించారు. సరిగ్గా ఎన్నికల ముందే చంద్రబాబుకు భద్రాద్రి రాములోరు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఏపీ విభజన సమయంలో ఈ విషయమై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.అప్పుడే భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని కేంద్రాన్ని ఒప్పించి ఏపీకి తెచ్చుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అప్పట్లో రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ఈ విషయమై చంద్రబాబు మాట్లాడలేదనీ, కానీ ఈరోజు వాటిలో ఒక కన్ను పోయింది కాబట్టి అడుగుతున్నారని సెటైర్లు వేశారు.
* కేసీఆర్ నిజస్వరూపం బట్టబయలు- చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ మేలు కోసమే కేసీఆర్‌ ఈ హోదా డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. జగన్‌తో కుమ్మక్కు రాజకీయాలను స్వయంగా కేసీఆర్‌ వెల్లడించి తన నిజ స్వరూపాన్ని ఆయనే బట్టబయలు చేసుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి డీమ్డ్ టు అప్రూవల్ అని చట్టంలో ఉందని.. మరి ఆ ప్రాజెక్టుపై ఎందుకు అన్ని కేసులు వేశారని ప్రశ్నించారు.
* రాజ్యాంగ స్ఫూర్తితో పారదర్శక పాల- పవన్‌
జనసేన అధికారంలోకి వస్తే రైతులు, యువకులు, మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ తెలిపారు. సామాన్యులకు సైతం రాజకీయాలను దగ్గర చేసేందుకు పార్టీ పనిచేస్తుందని వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికలోని ముఖ్యమమైన అంశాలను వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు చేయనున్నట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పారదర్శక పాలన అందిస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.
* నా ఓటమికి భాజపా, కాంగ్రెస్‌ జట్టు- కవిత
నిజామాబాద్‌లో తనను ఓడించేందుకు జాతీయపార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ కలిసిపోయాయని నిజామాబాద్‌ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ఐదేళ్లలో ఏ సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రధాని నరేంద్రమోదీ ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామంటే ఏ రకంగా నమ్మాలని కవిత ప్రశ్నించారు. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాన్ని అభివృద్ధి ఎవరో చేశారో ఆలోచించి ఓటు వేయాలని, భాజపా మాటలు నమ్మి యువత బలికావద్దన్నారు.
* సంక్షేమానికి రూ.లక్ష కోట్ల ఖర్చు -యనమల
రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా రైతులు, పేదల సంక్షేమానికి ఏ లోటూ లేకుండా చూశామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. వడ్డీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నా వెనకంజ వేయకుండా రుణాలు తీసుకొచ్చి అన్నా క్యాంటీన్‌ వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో యనమల విలేకరుల సమావేశం నిర్వహించారు.మనది సంక్షేమ రాజ్యమని, అందుకే రాష్ట్రంలో రూ.లక్ష కోట్లు ఖర్చు ఇందుకోసం పెడుతున్నట్లు వెల్లడించారు. కాస్త ఆలస్యమైనా నిరుద్యోగ భృతి ఇస్తున్నామని ఆయన తెలిపారు.
* రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం- నాని
ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్లే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. విజయవాడలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
* 16 సీట్లతో కేసీఆర్‌ ప్రధాని అవుతారా?- అమిత్‌షా
ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. 16 స్థానాల్లో తమను గెలిపించాలని తెరాస నేతలు కోరుతున్నారని, ఆ సీట్లతో కేసీఆర్‌ దేశ ప్రధాని కాగలుగుతారా?అని ప్రశ్నించారు. శంషాబాద్‌లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*పరీక్షల ఫీజు మాఫీ చేస్తాం – రాహూల్
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రాహూల్ గాంధీ విద్యార్ధులు, నిరుద్యోగులు తన పేస్ బుక్ పేజీ ద్వారా కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో జరిగే అన్ని రకాల పరీక్సహల్కు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు అజ్రీ చేస్తామన్నారు. అలాగే రైట్ టూ హెల్త్ అనే కొత్త పధకాన్ని తీసుకొచ్చి.. దానికోసం బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తామని రాహూల్ పోస్టులు తెలిపారు.
*ప్రచారంలో బండి సంజయ్ కి వడదెబ్బ
కరీంనగర్ లో భాజపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్హి బండి సంజయ్ అస్వస్థతకు లోనయ్యారు. రాజీవ్ చౌక్ నుంచి భాజపా విజయ్ సంకల్ప్ పాదయాత్ర పేరుతొ ఆయన ఎన్నికల ప్రచారంలో ఈ ఉదయం పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భాజపా కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రచారం చేస్తుండగా సడెన్ గా బండి సంజయ్ కళ్ళు తిరిగిపడిపోయారు. ఆయన అనుచరులు వెంటనే బండి సంజయ్ ను అంబులెన్స్ లో స్థానిక అపోలో రీచ్ హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. బండి సంజయ్ కు వడదెబ్బ తాకడం వల్లే ఇబ్బంది పడ్డారని ఎవరూ ఆందోళన చేనదలసిన అవసరం లేదని చెప్పారు డాక్టర్లు బండి సనజర్ కు అపాయం లేదు. ఎండలో స్ట్రెయిన్ అవ్వడం వాళ్ళ ఇక్కడకు తీసుకొచ్చారు. ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీ కేర్ ఫిజిషియన్స్ ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. ఈసీజీ, ఎకో, ల్యాబ్ టెస్టులు రక్త పరీక్సహ్లు అన్ని చేస్తున్నాం. మా డాక్టర్ల టీం అంతా అక్కడే ఉంది. ఆయనకు ఎటువంటి అపాయం లేదు. కార్యకర్తలు ఆందోళన పడొద్దు. అబ్జర్వేషన్ లోనే ఉన్నారు. తొందరగానే పూర్తీ ఆరోగ్యంతో పంపిస్తాం. పోటాషీయం లెవెల్స్ తగ్గిపోయి డీహైడ్రేషన్ జరిగింది హార్ట్ సమస్యలు ఏమీ లేవు. ఆరోగ్యంగానే ఉన్నారు. అని డాక్టర్లు చెప్పారు.
* చంద్రబాబుకు దారుణ ఓటమి తప్పదు- ఒవైసీ
మహిళా సంరక్షణ బీజేపీతోనే అనడం అబద్ధమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. జేఎన్‌యూలో మహిళలపై ఏబీవీపీ దాడులు చేసి రెండేళ్లు గడిచిన బీజేపీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారని.. ఐదేళ్ల కాలంలో ఎందుకు చేయలేదని ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగం నుంచి ఆర్టికల్‌ 370ని తొలగించలేరని అన్నారు. యూనిఫార్మ్‌ సివిల్‌ కోడ్ తెస్తామని చెప్పారని.. దానికి లా కమిషన్‌ ఒప్పుకోలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మాబ్‌ లించింగ్స్‌ ఎక్కువగా పెరిగాయన్నారు.
* ఆర్కేకు ఓటేస్తే.. మంత్రి అవుతాడు – వైఎస్‌ జగన్‌
‘నా సోదరుడు.. లోకల్‌ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిని ప్రతి కుంభకోణం.. మోసం.. వంచన అన్ని మంగళగిరి కేంద్రంగానే జరిగాయన్నారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన సుపుత్రుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
*నా ఓటమికి భాజపా, కాంగ్రెస్‌ జట్టు- కవిత
నిజామాబాద్‌లో తనను ఓడించేందుకు జాతీయపార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ కలిసిపోయాయని నిజామాబాద్‌ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ఐదేళ్లలో ఏ సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రధాని నరేంద్రమోదీ ఇవ్వలేదని, ఇప్పుడు ఇస్తామంటే ఏ రకంగా నమ్మాలని కవిత ప్రశ్నించారు. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాన్ని అభివృద్ధి ఎవరు చేశారో ఆలోచించి ఓటు వేయాలని, భాజపా మాటలు నమ్మి యువత బలికావద్దన్నారు.
*రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం- నాని
ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్లే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. విజయవాడలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ప్రపంచంలో ఎక్కడా ఒక రాజకీయ నేతపై 31 కేసులు లేవని, ప్రతిపక్ష నేత జగన్‌పై ఈ కేసులు ఉండడం రాష్ట్రానికి సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఆయన కుటుంబం ఆరాచక శక్తులకు నెలవని విమర్శించారు. 25 మంది వైకాపా ఎంపీ అభ్యర్థుల్లో 12 మందిపై కేసులు ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబును గతంలో పదేళ్లు ప్రతిపక్ష హోదాకు పరిమితం చేయడం వల్లే రాష్ట్రం విడిపోయిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే గత ఎన్నికల్లో బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.
*కుప్పంలో కనిపించని వైకాపా అభ్యర్ధి
తెదేపాకు కంచుకోటగా ఉన్న కుప్పంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రమౌళి తరఫున కుటుంబ సభ్యులే ప్రచారాన్ని ముగించనున్నట్లు తెలుస్తోంది. కుప్పంలో పార్టీ అధినేత జగన్‌ పాల్గొన్న రోడ్‌షోకూ చంద్రమౌళి రాకపోవడంతో ఆయన కుమారుడిని ముందు పెట్టుకొని పూర్తి చేశారు. చంద్రమౌళి తరఫున ఆయన భార్య పద్మజ, కుమారుడు భరత్‌ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. పద్మజ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ భర్త చంద్రమౌళి విజయానికి ప్రచారం చేస్తున్నారు.
*వైకాపా వినతులను పరిష్కరించాలి: హైకోర్టు
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, పోలింగ్‌ ప్రక్రియ వీడియో రికార్డింగ్‌, భద్రతా దళాల మోహరింపునకు చర్యలు తీసుకోవాలని వైకాపా సమర్పించిన వినతిని.. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఇచ్చిన మరో వినతిని చట్ట నిబంధనల మేరకు పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. వైకాపా ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఈ పిటిషన్లు వేశారు.
*ఉద్యోగాలకు ధరఖస్తు రుసుములు రద్దు చేస్తాం
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు జరిగే పరీక్షలకు దరఖాస్తు రుసుములు రద్దు చేస్తామని ఆ పార్టీ అద్యక్షుడు రాహూల్ గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టాన్ని కూడా తెస్తామని తెలిపారు. దీని వల్ల పౌరులకు ఆరోగ్య పరిరక్షణ సేవలకు పూచీకత్తు లభిస్తుందని చెప్పారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి పెంచుతామని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను కూడా జనంలోకి ఉదృతంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. తమ ప్రచార వీడియోను షేర్ చేయాలంటూ ప్రజలను ట్విట్టర్ లో కోరారు.
*రేపు అమెటీలో నామినేషన్
అమేథీ లోక్ సభ స్థానంలో రాహూల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. తల్లి సోనియా గాంధి, సోదరి ప్రియాంకా గాంధీ ఆయన వెంట వస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం గౌరీగంజ్ పట్టణంలో రాహూల్ రోడ్ షా నిర్వహించనున్నారు. అమెదీలో ఆయన పదిహేనేళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
*ప్రత్యేక ప్రధాని కావాలని మాట్లాడితే ‘ఆర్టికల్‌ 370, 35ఏ’ రద్దు
ఉగ్రవాద బాధిత రాష్ట్రమైన జమ్మూకశ్మీరుకు ప్రత్యేకంగా ప్రధాని కావాలని ఎవరైనా మాట్లాడితే, ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తున్న ‘ఆర్టికల్‌ 370, 35ఏ’లను రద్దు చేయడం మినహా కేంద్రప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలా మాట్లాడుతున్నవారిని కాంగ్రెస్‌ సమర్థిస్తుందో, లేదో స్పష్టం చేయాలని ఆయన డిమాండు చేశారు. దేశానికి ఇద్దరు ప్రధానులను ఆ పార్టీ సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడారు.
*వయనాడ్ లో పోటీ రాహూల్ పొరపాటు – సురవరం
కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో పోటీకి దిగాలనుకోవడం కాంగ్రెస్ అద్యక్షుడు రాహూల్ గాంధీ చేసిన పొరపాటని, ఆయనను వామపక్షాలు ఓడిస్తాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరావు పేర్కొన్నారు. కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు వయనాడ్ గతంలో కాంగ్రెస్ కు కంచుకోతలాంటిదని ఇప్పుడు కాదని తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాల మధ్య పోలిన ఓట్లే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం 22వేల ఓట్లు మాత్రమే తేడా అని గుర్తు చేశారు.
*ఐదేళ్లలో ఒక్క హామీ నెరవేర్చలేదు
గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క హామీనీ నెరవేర్చలేదని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. మళ్లీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేశారని, ఇది ప్రజలను మళ్లీ మోసం చేయడమేనని విమర్శించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో, కాకినాడ గ్రామీణంలోని ఇంద్రపాలెం ముసలమ్మతల్లి ఆలయం వద్ద రోడ్‌షోలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, కొవ్వూరుల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు.
*వైకాపా నేతలవి దుర్మార్గాలు
వైకాపా నేతలు నరరూప రాక్షసుల్లా మారారని, వారికి ఓట్లేస్తే జనాన్ని బతకనిస్తారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల మిషన్‌-2019పై సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.
*మళ్లీ మీరే అధికారంలోకి రావాలి
రాష్ట్రంలో ధర్మపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ప్రతినిధులు, పీఠాధిపతులు ఆశీర్వదించారు. గత ఐదేళ్లలో హిందూ దేవాలయాల పరిరక్షణకు సీఎం ఎంతో సహకరించారని, బలహీనవర్గాల వారితో కల్యాణోత్సవాలు జరిపించారని పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబును కలిశారు.
*భాజపా మేనిఫెస్టో అబద్ధాల పుట్ట
దేశ ప్రజలను మరోసారి వంచించేందుకు భారతీయ జనతా పార్టీ యత్నిస్తోందని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ అవే తరహా హామీలకు సొబగులద్ది సరికొత్త గడువులతో మేనిఫెస్టోను విడుదల చేసిందని వారు ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణం 370 రద్దు హామీపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
*వయనాడ్‌లో ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు
వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఈ నెల 23న జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలని రైతులు, ఇక్కడి తోటల్లో పనిచేసే కార్మికులకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ముందక్కైలో వారి పేరిట పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. దీనిపై వయనాడ్‌ జిల్లా పోలీస్‌ అధికారి ఆర్‌.కరుప్పసామి మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.
*మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎంత?
ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లలో రూ.5.56 లక్షల కోట్లు ఇచ్చామని భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పడం పచ్చి అబద్ధమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అన్నీ చేశామని చెబుతున్న ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకివ్వలేదో చెప్పాలని డిమాండు చేశారు. తొలి ఏడాది ఆర్థిక లోటు కింద పెండింగ్‌లో ఉన్న రూ.12వేల కోట్లు ఎందుకివ్వలేదో చెప్పాలని సోమవారం ఓ ప్రకటనలో నిలదీశారు.
*సాక్షి పత్రిక, ఛానళ్లను నిలిపివేయండి
సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానళ్లను ఉపయోగించి వైకాపా తన రాజకీయ ప్రత్యర్థులపై అసత్య, నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తోందని, ఓటర్లను భయపెడుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సోమవారం ఫిర్యాదు చేసింది. సాక్షి పత్రిక ప్రచురణను, సాక్షి ఛానల్‌ ప్రసారాలను తక్షణం నిలిపివేయాలని కోరింది. తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ సోమవారం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి వైకాపాపైనా, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా రెండు వేర్వేరు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక వైకాపాపై తాము ఇంత వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చేసిన 116 ఫిర్యాదుల జాబితాను వాటికి జతచేశారు.
*కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తాం
జమ్ము-కశ్మీర్‌కు ప్రస్తుతం రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక హోదాను రద్దు చేయనున్నట్టు భాజపా ప్రకటించింది. ప్రత్యేక హోదాకు వీలు కలిగిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని తొలగిస్తామని పేర్కొంది. ఆ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు ఎవరూ ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధిస్తున్న 35ఏ అధికరణాన్ని కూడా రద్దు చేస్తామని తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దశల వారీగా జాతీయ పౌరుల పట్టిక (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌)లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ‘సంకల్ప్‌ భారత్‌- సశక్త్‌ భారత్‌’ పేరుతో రూపొందించిన 45 పేజీల ‘సంకల్ప్‌ పత్ర’ (ఎన్నికల మేనిఫెస్టో)లో ఈ అంశాలను స్పష్టం చేసింది.
*కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తాం
జమ్ము-కశ్మీర్‌కు ప్రస్తుతం రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక హోదాను రద్దు చేయనున్నట్టు భాజపా ప్రకటించింది. ప్రత్యేక హోదాకు వీలు కలిగిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని తొలగిస్తామని పేర్కొంది. ఆ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు ఎవరూ ఆస్తులు కొనుగోలు చేయకుండా నిరోధిస్తున్న 35ఏ అధికరణాన్ని కూడా రద్దు చేస్తామని తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దశల వారీగా జాతీయ పౌరుల పట్టిక (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌)లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
*భవిష్యత్‌ ప్రధాని చంద్రబాబే: దేవేగౌడ
దేశానికి భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అర్హత చంద్రబాబు నాయుడికి ఉందని మాజీ ప్రధాని దేవేగౌడ పేర్కొన్నారు. తెదేపాకి మద్దతుగా చంద్రబాబుతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన విజయవాడలో తెదేపా సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహనరావుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం కృష్ణా జిల్లాలోని తిరువూరులో ఎన్నికల ప్రచార సభ, రోడ్‌షోల్లో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు. దేశానికి కాబోయే ప్రధాని.. చంద్రబాబు అంటూ దేవేగౌడ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘దేశం ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నింటినీ మోదీ నిర్వీర్యం చేశారు.
*ఐదేళ్లలో ఒక్క హామీ నెరవేర్చలేదు
గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క హామీనీ నెరవేర్చలేదని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. మళ్లీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేశారని, ఇది ప్రజలను మళ్లీ మోసం చేయడమేనని విమర్శించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో, కాకినాడ గ్రామీణంలోని ఇంద్రపాలెం ముసలమ్మతల్లి ఆలయం వద్ద రోడ్‌షోలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, కొవ్వూరుల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు.
*మోదీని ఇక సాగనంపండి
ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోజు రోజుకూ మాటల తీవ్రత పెంచుతున్నారు. ఆయనను ‘ఫాసిస్టు, అసత్యవాది, దోపిడీదారు’గా పేర్కొంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారు. కూచ్‌బిహార్‌, నగర్‌కతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వాన్ని సాగనంపి, కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో పశ్చిమబెంగాల్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
*భాజపా మేనిఫెస్టో అబద్ధాల పుట్ట
దేశ ప్రజలను మరోసారి వంచించేందుకు భారతీయ జనతా పార్టీ యత్నిస్తోందని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ అవే తరహా హామీలకు సొబగులద్ది సరికొత్త గడువులతో మేనిఫెస్టోను విడుదల చేసిందని వారు ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణం 370 రద్దు హామీపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
*చివరి రోజు ప్రచారం హోరెత్తాలి
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు హోరెత్తాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, తెరాస అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు. ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు పెద్దఎత్తున జరపాలని సూచించారు. సోమవారం రాత్రి ఆయన మంత్రులు, అభ్యర్థులతో, ప్రజాప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ప్రచారం ముగుస్తున్నందున ప్రతిచోటా ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అంతా సంతృప్తికరంగా సాగిందని, చివరి రోజు అదే ఒరవడి కనిపించాలన్నారు. పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాలన్నీ ప్రచారంలో పాల్గొనాలని తెలిపారు.
*ఉద్యోగాలకు దరఖాస్తు రుసుములు రద్దు చేస్తాం
కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు జరిగే పరీక్షలకు దరఖాస్తు రుసుములను రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టాన్ని కూడా తెస్తామని తెలిపారు. దీనివల్ల పౌరులకు ఆరోగ్య పరిరక్షణ సేవలకు పూచీకత్తు లభిస్తుందని చెప్పారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 3 శాతానికి పెంచుతామని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను కూడా జనంలోకి ఉద్ధృతంగా తీసుకెళతామని పేర్కొన్నారు. తమ ప్రచార వీడియోను షేర్‌ చేయాలంటూ ప్రజలను ట్విటర్‌లో కోరారు.
*విదేశాంగ వ్యవహారాల్లో ప్రధాని విఫలం
విదేశాంగ వ్యవహారాల్లో ప్రధాని మోదీ విఫలమయ్యారని, తద్వారా భాజపా పాలనలో దేశ సరిహద్దుల్లో హింస పెరిగిందని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. సోమవారం రాత్రి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. కవిత మాట్లాడుతూ.. గత 70ఏళ్లలో దేశ సరిహద్దులో జరగని హింస గడిచిన ఐదేళ్లలో జరిగిందన్నారు.
*తెలంగాణను పట్టించుకోని మోదీ, రాహుల్‌
ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రం సిద్దిపేటలో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..మోదీ గుజరాత్‌కు బుల్లెట్‌ రైలు ఇచ్చారని, మహారాష్ట్ర ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లు మంజూరు చేశారని, రాహుల్‌గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారని పేర్కొన్నారు.
*కేసీఆర్‌పై మోదీకి ప్రేమ ఎందుకు?: జైపాల్‌రెడ్డి
కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: దేశంలోని విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లో ఐటీ దాడులు చేయిస్తున్న ప్రధాని మోదీ, అవినీతి పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌పై ఎందుకు ప్రేమ చూపుతున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*ఆడ్వాణీ, జోషీతో అమిత్‌ షా భేటీ
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సోమవారం పార్టీ వ్యవస్థాపకుడు ఆడ్వాణీ, సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీలను వేర్వేరుగా కలిశారు. భాజపా తన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన కొద్ది గంటల అనంతరం ఆయన వారిద్దరిని కలిశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వీరిద్దరికి పార్టీ టిక్కెట్లు ఇవ్వని విషయం విదితమే. ఈ నేపథ్యంలో అడ్వాణీ, జోషీలను అమిత్‌ షా కలవడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
*తెలంగాణలోకి దొడ్డిదారిలో భాజపా
రాష్ట్రంలో భాజపాకు మొహం చెల్లక తెరాస అనే దొడ్డిదారిలో వస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు, రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఆరోపించారు. తెరాసకు వేసే ప్రతి ఓటు భాజపాకు వేసినట్లేనని ఆరోపించారు. తెలంగాణవాసుల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న మంత్రిమండలిలో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు.
*వ్యూహాత్మకంగానే లోక్‌సభ ఎన్నికలకు దూరం
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండటం తమ వ్యూహంలో భాగమేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. సోమవారం తెదేపా హైదరాబాద్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్‌, అధికార ప్రతినిధి పెద్దిరెడ్డిలతో కలిసి మాట్లాడారు.
*మహిళల గదుల్లో సోదాలు చేయడం హేయం
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరి ఆరోపించారు. తన వాహనాలు, పార్టీ పరిశీలకులు ఉన్న హోటల్‌ గదులను సోదాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడితే భయపడేది లేదన్నారు. ఖమ్మం నగరంలో పార్టీ నాయకులు ఉన్న హోటల్‌ గదులు, వాహనాలను పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ ఆమె సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*అనుభవం, దూరదృష్టికే పట్టం: లగడపాటి
ఎన్నికల్లో ఏదైనా ఓ పార్టీకి మెజారిటీని కట్టబెట్టే సంప్రదాయంఉన్న రాష్ట్రం ఏపీ. అనుభవం, దూరదృష్టిఉన్న వ్యక్తికి ఓటర్లు పట్టం కట్టే అవకాశం ఉందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. సోమవారం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ..మే 19న తెలుగు రాష్ట్రాల్లºని సర్వే ఫలితాలను వెల్లడిస్తానన్నారు.
**వయనాడ్‌లో పోటీ రాహుల్‌ పొరపాటు
కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలోపోటీకి దిగాలనుకోవడం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన పొరపాటని, ఆయనను వామపక్షాలు ఓడిస్తాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. వయనాడ్‌ గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిదని, ఇప్పుడు కాదని తెలిపారు.