ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ కోసం నిర్వహించిన వేలం మంగళవారం ముగిసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ వేలంలో మొత్తం 12 జట్లు కలిసి ఆటగాళ్ల కోసం రూ.50 కోట్లు ఖర్చుపెట్టాయి. తొలి రోజు వేలంలో తెలుగు టైటాన్స్.. రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ కోసం భారీ మొత్తం రూ.1.45 కోట్లు చెల్లించగా.. రెండో రోజు ఆశ్చర్యకర పరిణామాలేవీ చోటు చేసుకోలేదు. డిఫెండర్ నీరజ్ కుమార్ కోసం పట్నా పైరేట్స్ రూ.44.75 లక్షలు ఖర్చుపెట్టింది. వికాస్ కాలె కోసం హరియాణా స్టీలర్స్ రూ.34.25 లక్షలు చెల్లించింది. తెలుగు టైటాన్స్ అమిత్ కుమార్, అరుణ్‌లను చెరో రూ.10 లక్షలకు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు మూల శివ గణేశ్ రెడ్డిని రూ.6 లక్షలకు టైటాన్స్ సొంతం చేసుకుంది. విదేశీ, స్వదేశీ ఆటగాళ్లు కలిసి మొత్తం 200 మంది వేలంలో అమ్ముడుపోయారు. పీకేఎల్ ఏడో సీజన్ జులై 1 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగనుంది.
కబడ్డీ లీగ్ వేలం పూర్తి
Related tags :