Health

గుంజీలతో రోజు మొదలుపెడితే…

sqauts will boost your day

ఎక్సర్ సైజ్ చేసి కండలు కొందరు పెంచుకుంటరు . ఇదే ఫార్ములా మెదడుకి వర్తిస్తుంది . మెదడు ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది . ప్రాక్టీస్ చేసిన మూడు నెలల్లోనే మీలో మీరే మార్పు గమనిస్తరు . కొన్ని వారాల్లోనే మీ ఏకాగ్రత స్థాయిల్లో మార్పు వచ్చి తీరుతుంది . ఏడు నెలలు వరుసగా ప్రాక్టీస్ చేస్తే పిల్లల్లో 20 నుంచి 35 శాతం అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నయ్ .మెదడులో ఉండే ఆల్ఫా తరంగాలు శక్తివంతమై మెదడుని యాక్టివేట్ చేస్తాయి .ఒత్తిడి తగ్గుతుంది . మానసిక ఆరోగ్యం మెరుగైతది .నాడులు స్పందించి, మెదడుకు అందే సంకేతాలను మెరుగుపరుస్తుంది.మెదుడు చురుకుగా మారి సృజనాత్మకత పెరుగుతుంది.డిస్లెక్సియా ( స్పెల్లింగ్ ని బట్టి చదవలేకపోవడం ) , ఒత్తిడి , యాంక్సైటీ , బ్రెయిన్ ఫాగ్ దేన్ని గుర్తుంచుకోలేకపోవడం ) డిమెన్షియా ( సరిగ్గా ఆలోచించలేకపోవడం ) వంటి రుగ్మతలుపోతాయి .ఈ టెక్నిక్ వృద్ధులకు అద్భుతంగా ఉపయోగపడుతది . వాళ్లు రోజు చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందట . చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారంట .ఆలోచనల్లో స్పష్టత వస్తుంది . అంతేకాదు ఆకలి అదుపులో ఉంటది .కేవలం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఈ సూపర్ బ్రెయిన్ యోగ ఉపయోగపడుతుంది.