Politics

సుప్రీంకోర్టు విచారణ చేసి తీరుతుంది

supreme court says it will move ahead with enquiry into rafale scam

రాఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రహస్య డాక్యుమెంట్ల ఆధారంగా తీర్పును సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. రాఫేల్‌ కొనుగోలుపై మోదీ ప్రభుత్వ అభ్యంతరాలను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యతిరేకించింది. రక్షణశాఖ నుంచి చోరీ చేసిన డాక్యుమెంట్లపై కేసును సమీక్షించరాదు అంటూ సుప్రీంను కేంద్రం కోరింది. కానీ ఆ అభ్యంతరాలను చీఫ్‌ జస్టిస్‌ తిరస్కరించారు. దీంతో రాఫేల్‌ కొనుగోలుపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రహస్య పత్రాలపై సుప్రీం విచారణ చేపట్టనున్నది.