క్యాబ్‌సేవల దిగ్గజం ఉబెర్ ఐపీవోకు సిద్ధమైంది. మొత్తం 10 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను ఇది విక్రయించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఐపీవో సైజును బట్టి 2014 తర్వాత ఒక టెక్నాలజీ సంస్థ తీసుకొస్తున్న పెద్ద ఐపీవోగా నిలిచిపోనుంది. తొలుత ఉబెర్ విలువను 120 బిలియన్ డాలర్లుగా భావించారు. కానీ ఇటీవల క్యాబ్ సేవల సంస్థ ఎల్‌వైఎఫ్‌టీ ఐపీవోకు వచ్చి పెట్టుబడి దారులను ఆకర్షించలేకపోయింది. దీంతో ఉబెర్ విలువను 90-100 బిలియన్ డాలర్ల మధ్య కుదించారు. కొన్నాళ్ల కిందట ఒక నిధుల సమీకరణలో ఉబెర్ విలువను 76 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజి కమిషన్ వద్ద ఉబెర్ గురువారం ఐపీవోకు రిజిస్టర్ చేసుకోనుంది. ఏప్రిల్ చివరల్లో రోడ్‌షో నిర్వహిస్తుంది. మే మొదటి వారంలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజిలో నమోదు కావచ్చని భావిస్తున్నారు.
స్టాక్‌మార్కెట్‌లోకి ఊబర్
Related tags :