లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాధారంగా బాలీవుడ్‌లో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు ‘83’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్ ఎలా గెలిచింది అన్న నేపథ్యంలో సినిమాను కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. లుక్‌లో క్రికెటర్స్ అంతా మైదానంలో కూర్చుని పోజివ్వడం ఆకట్టుకుంటోంది. కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. మరో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు తహీర్ రాజ్ భాసిన్, అప్పటి టీమిండియా మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణి పాత్రలో సాహిల్ ఖట్టర్, బల్వీందర్ సింగ్ పాత్రలో అమ్మీ విర్క్ నటిస్తున్నారు. 2020 ఏప్రిల్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కపిల్ బయోపిక్ ఫస్ట్‌లుక్
Related tags :