తెలంగాణలో 16 ఎంపీ స్థానాలకు ముగిసిన పోలింగ్ సా.5గం.ల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం. దాదాపు 60 శాతం వరకు నమోదైన పోలింగ్ నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లో కొనసాగుతున్న పోలింగ్. 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసిన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఆవకాశం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ పట్టణ ప్రాంతాల్లో అంతగా ఆసక్తి చూపని ఓటర్లు సాయంత్రం సమయంలో పెరిగిన పోలింగ్ హైదరాబాద్ 30 శాతం, సికింద్రాబాద్ లో 32 శాతం. ఆదిలాబాద్ లో 57 శాతం, వరంగల్ 51 శాతం నల్లగొండ 57 శాతం, నిజామాబాద్ 50 శాతం. కరీంనగర్ 60 శాతానికపైగా నమోదైన పోలింగ్ భువనగిరిలో 61 శాతం, ఖమ్మం 58 శాతం పోలింగ్. మెదక్లో 63 శాతంగా నమోదైంది తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉదయం ఏడింటికి పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా..అధికారులకు సమస్యలను పరిష్కరించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. భద్రత పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 85 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.అయితే.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటెత్తిన జనం.. పార్లమెంట్ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే..పట్టణ ప్రాంతాల్లో మరీ మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే..సాయంత్రానికి కొంతమేర పోలింగ్ ఊపందుకోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 శాతం ఓటింగ్ నమోదైంది.గ్రేటర్ పరిధిలోని ఓటర్లు మరోసారి ఓటింగ్ పై అనాసక్తి కనబర్చారు. హైదరాబాద్లో దాదాపుగా 30 శాతానిపైగా ఓటింగ్ నమోదైంది. అటు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 31 శాతం ఓటింగ్ నమోదైంది. దక్షిణ తెలంగాణతో పోలిస్తే…ఉత్తర తెలంగాణలో ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ 57 శాతం ఓటింగ్ జరిగింది. అత్యధికంగా జహీరాబాద్, భువనగిరి, కరీంనగర్ లో 60 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లో 58 శాతం ఓటింగ్ జరిగింది.తెలంగాణలోని 16 ఎంపీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఐదింటికి ముగియగా…నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లో మాత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అత్యధికంగా 185 మంది అభ్యర్ధులు బరిలో ఉండటంతో..భారీగా ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే..కవిత ఓటు హక్కు వినియోగించుకున్న పోతంగల్తో పాటు మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కవితతో సహా ఓటర్లు క్యూ లైన్లలో పడిగాపులు పడాల్సి వచ్చింది.మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డి గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. జడ్చర్ల నియోజకవర్గం బాదెపల్లి మున్సిపాలిటీలోని తమ గ్రామాన్ని విలీనం చేసినందుకు నిరసనగా గ్రామంలో ఓటు వేయొద్దని దండోరా వేశారు… గ్రామస్థులంతా ఎవరు ఓటు వేయకుండా పోలింగ్ కేంద్రం వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.
మెదక్లో అత్యధికం…హైదరాబాద్లో అత్యల్ఫం
Related tags :