Business

₹1.88కోట్ల నుండి ప్రారంభం

Porsche 911 Enter Indian Market

విలాసవంతమైన పోర్షె 911 సరికొత్త మోడల్‌ నేడు భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారు ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.1.82కోట్ల నుంచి రూ.1.99 కోట్ల వరకు ఉంది. కారేరా ఎస్‌ వేరియంట్‌ ధర రూ.1.82 కోట్లు కాగా, కారేరా ఎస్‌ కాబ్రియోలెట్‌ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించారు. పోర్షె 911లో ఇది ఎనిమిదోతరం కారు. దీనిని తొలిసారి 2018లో లాస్‌ఏంజెల్స్‌ ఆటోషోలో ప్రదర్శించారు. గత మోడల్‌ కంటే పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. ఇంజిన్‌, ఫ్రేములో మాత్రం మార్పులు చేర్పులు చేశారు. సరికొత్త పోర్షె 911లో దీనిలో ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ వ్యవస్థ ఉన్న 3.0లీటర్స్‌ సిక్స్‌ సిలిండర్స్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనిలో కొనుగోలు దారుల అభిరుచినిబట్టి 7స్పీడ్‌ మాన్యూవల్‌, లేదా ,8స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ వ్యవస్థను అమర్చారు. 444 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. గత మోడల్‌ కంటే ఇది 30బీహెచ్‌పీ శక్తి ఎక్కువ. ఈ రెండు వేరియంట్ల గరిష్ట వేగం గంటకు 307కిమీ, గంటకు 305 కిమీ వరకు ఉన్నాయి.