సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్నికలకు సంబంధించిన ట్వీట్లు, డిబేట్లు, సంభాషణలతో ట్విటర్ మారుమోగిపోయింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దాంతో గురువారం ఒక్క రోజు ఎన్నికలకు సంబంధించి 1.2 మిలియన్ ట్వీట్లు వచ్చాయి. ఇక మార్చి 11 నుంచి ఏప్రిల్ 11 వరకు 45.6 మిలియన్ ట్వీట్లు వచ్చాయి. ఈ విషయాన్ని ట్విటర్ ఇంటర్నల్ డేటా వెల్లడించింది. ప్రజలతో మమేకమయ్యేందుకు రాజకీయనేతలు, పార్టీలు ట్విటర్‌నే ప్రచార మాధ్యమంగా ఎంచుకున్నారు. ప్రచార కార్యక్రమాలు, మేనిఫెస్టోలు, సామాజిక అంశాలకు సంబంధించిన పాలసీలే టాప్ ట్వీటెడ్ మూమెంట్స్‌గా గుర్తించారు. ఇక ప్రజలు కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలు, సందేహాలను ట్విటర్ ద్వారానే సదరు పార్టీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. టాప్ ఎలెక్షన్ సంభాషణల్లో జాతీయ భద్రత, మతం, ఉద్యోగాలు, వ్యవసాయం, పన్ను, వాణిజ్య అంశాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన సంభాషణల్లో ట్విటర్‌లో ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ గురించే ప్రస్తావించారు. ట్విటర్ సంభాషణలో ప్రస్తావించిన రాజకీయ ప్రముఖుల్లో భాజపా అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెత్ నేత ప్రియాంక గాంధీ ఉన్నారు. జాతీయ భద్రత అత్యంత మంది చర్చించిన అంశంగా ట్విటర్ గుర్తించింది.
ట్విట్టర్‌ను షేక్ చేసిన భారతీయులు
Related tags :