సార్వత్రిక ఎన్నికల సమయంలో తరచూ వినిపిస్తున్న నియోజకవర్గం పేరు.
ఇందుకు కారణం… అక్కడ సినీ నటి జయప్రద పోటీకి నిలవడమే. 2014లో భాజపా అభ్యర్థిపై ఓడిపోయిన ఆమె ఈసారి అదే పార్టీ తరఫున బరిలోకి దిగారు.
సమాజ్‌వాదీ పార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జయప్రద ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఉత్తరప్రదేశ్ రామ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎస్పీ తరఫున బరిలో ఉన్నది ఆజంఖాన్ కావటం విశేషం.
సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న రోజుల్లో ఆజంఖాన్‌ను సోదరుడిగా భావించేవారు జయప్రద.
ఆ తర్వాత ఎన్నో వివాదాలు. చివరకు… వారిద్దరూ ప్రత్యర్థుల్లా నేరుగా పోటీపడే పరిస్థితి వచ్చింది.