నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే పరుగు అంతకు రెట్టింపు ఉపయోగకరం! పరుగుతో చేకూరే లాభాలు బోలెడన్ని! పరుగుతో గ్రంథుల పనితీరు సక్రమమై సరిపడా హార్మోన్లు విడుదలవుతాయి. దాంతో జీవక్రియలు సరిగ్గా జరిగి, ఆరోగ్యం బలపడుతుంది.పరుగుతో లోపలికి ఎక్కువగా గాలి పీల్చుకుంటాం. దాంతో ఊపిరితిత్తులు బలపడతాయి. ఫలితంగా ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం దరి చేరకుండా ఉంటాయి.ఉదయం పూట జాగింగ్ చేస్తే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఫలితంగా తరచుగా ఇన్‌ఫెక్షన్లకు గురి కాకుండా ఉంటాం!పరుగుతో నడుము కింది భాగంలోని కండరాలు, ఎముకలు ధృడమవుతాయి.కీళ్లకు సంబంధించిన టెండాన్లు, లిగమెంట్లు బలపడతాయి. దాంతో ప్రమాదాల్లో కీళ్లు విరగడం, పట్టు తప్పడం లాంటి సమస్యలకు తావుండదు.పరుగుతో కలిగే ఒత్తిడిని తట్టుకోవడం కోసం శరీరం కీళ్ల దగ్గరకు అవసరమైన ఖనిజలవణాలను సరఫరా చేస్తుంది. దాంతో ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా చిన్న చిన్న ప్రమాదాల్లో ఎముకలు విరిగే సమస్య దూరమవుతుంది.పరుగు అలవాటు అయితే తూలి పడిపోవడం, తొట్రుపాటు లాంటి బ్యాలెన్స్‌కు సంబంధించిన సమస్యలు కూడా తొలుగుతాయి. శరీరం పోశ్చర్‌లో లోపాలు కూడా తొలగి, చక్కని ఆకారం సంతరించుకుంటుంది.పరుగుతో మధుమేహం అదుపులో ఉంటుంది. వంశపారంపర్యంగా మధుమేహం సంక్రమించే వీలున్నవారు పరుగు అలవాటు చేసుకుంటే ఎక్కువ కాలంపాటు ఆ వ్యాధిని వాయిదా వేసే వీలుంటుంది.
పరుగు లాభాలు లెక్కలేనన్ని!
Related tags :