విమానం ఆలస్యం అయితే సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రయాణికులకు భోజనం, ఉండడానికి వసతి కల్పించాలి. ఇది ప్రయాణికుల హక్కు. ఆ సంస్థ విధి. ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణికులు కలిగి ఉండే హక్కులు, వాటి వివరాలు..ప్రయాణం చేసే సమయంలో మనకు కల్పించాల్సిన వసతుల గురించి మనం ప్రశ్నించం. భయపడుతాం. వినియోగదారుడిగా మనకూ కొన్ని హక్కులు ఉంటాయి. వాటిలో ఏది తక్కువైనా, ఎక్కువైనా ప్రశ్నించవచ్చు. వాటి గురించి ప్రశ్నించాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి. ఇటీవల సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హక్కుల వివరాలు ఇలా ఉన్నాయి. -ఒకవేళ విమానం రెండు నుంచి ఆరుగంటలు (ప్రయాణించే దూరం, సమయం బట్టి) ఆలస్యం అయితే అప్పటి వరకు ఉండేందుకు అనువైన ప్రదేశం, ఆహారం ఇవ్వాలి. ఇది కేవలం టికెట్ ఉన్న వ్యక్తికే వర్తిస్తుంది. ఆరుగంటలకు ఎక్కువ ఆలస్యం అయి అది రాత్రి ఎనిమిది నుంచి ఉదయం 3 గంటల మధ్య కాలం అయితే ముందు రోజే ప్రయాణికుడికి సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఉండడానికి హోటల్ మిగతా ఏర్పాట్లు చేయాలి. ఆరుగంటల కన్నా ఎక్కువ ఆలస్యం అయినా ప్రత్యామ్నాయంగా ఇతర విమాన ఏర్పాటు కానీ, టికెట్‌కు పూర్తి డబ్బులు కానీ తిరిగి ఇచ్చేయాలి. -సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేసినా, దానివల్ల కనెక్టింగ్ ఫ్లయిట్స్ మిస్సయినా, ఆ విమానాన్ని అందుకునే ఏర్పాట్లు చేయాలి. అంతదూరం ప్రయాణించనికి అయ్యే ఖర్చు తక్కువలో తక్కువ గంటకు ఐదు వేల చొప్పున చెల్లించాలి. -టికెట్ బుక్ చేసిన క్షణం నుంచి విమానం బయలుదేరాల్సిన తేదీకి ఏడు రోజుల ముందు వరకు ఎప్పుటు టికెట్ రద్దు చేసుకున్నా ఎటువంటి చార్జీలు లేకుండా అన్ని డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. -ప్రయాణికుల పేర్లు మార్చుకోవాలంటే టికెట్ బుక్ చేసిన తర్వాత 24 గంటలలోపు ఎటువంటి ఫీజు లేకుండా పేర్లు మార్చుకోవచ్చు. -బ్యాగేజీలో ఉన్న వస్తువులు పగిలిపోతే కిలో మూడు వందల రూపాయల నుంచి మొదలుకొని 20 వేల వరకు (వస్తువుల ఖరీదును బట్టి) చెల్లిస్తుంది. -ఎయిర్‌లైన్స్ కారణంగా ప్రయాణికులకు ప్రమాదం జరిగినా, గాయాలైనా పరిహారంగా 20 లక్షల రూపాయలను చెల్లించాలి.
విమాన ప్రయాణీకులకు ఈ హక్కులు తప్పక ఉంటాయి
Related tags :