రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. నిన్న 14 విమానాలతో సేవలందించిన సంస్థ.. నేడు కేవలం 9 విమానాలనే నడిపే స్థితికి పడిపోయింది. శుక్రవారం జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 9 విమానాలే సర్వీసులు అందిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. వీటిలో రెండు బోయింగ్ 737 కాగా.. మరో ఏడు ప్రాంతీయ జెట్ ఏటీఆర్‌లు ఉన్నాయి. కాగా.. తాజా పరిణామాలపై పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. జెట్ పరిస్థితులపై సమీక్ష జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ‘జెట్ సమస్యపై సమీక్ష జరపాలని విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఆదేశించాం. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించి వారికి సరైన భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం’ అని సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు.
దారుణంగా తయారైన జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి
Related tags :