తులసిని అత్యంత పవిత్రంగా కొలిచేవారు పూర్వీకులు. ఉదయం లేవగానే తులసి పూజ చేయకుండా పనులు మొదలు పెట్టేవాళ్లు కాదు. పురాణాల్లో కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అత్యంత ఆరోగ్యకరమైన అంశాలు తులసిలో ఉన్నాయి. ఇంతటి పవిత్రత గల తులసి గురించి.. ఎన్నో ఏళ్ల తరబడి హిందువులు భగవంతుడికి కానుకలు, పువ్వులు సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనదని, ఔషధాలతో కూడుకున్నదని పద్మ పురాణంలో పేర్కొన్నారు. తులసి మొక్కను చూసినా లేదా తాకినా అన్ని రకాల ఒత్తిడులు, జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి మొక్కపై నీళ్ళు పోస్తే భయాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా తులసి మొక్కను నాటినా, నీళ్లుపోసినా వారు కృష్ణుడికి ప్రీతి పాత్రమవుతారని స్కందపురాణం చెబుతోంది. అయితే కేవలం దైవత్వానికే కాకుండా తులసిలో కొన్ని రకాల ఔషధగుణాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభాలెన్నో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
* కాచి చల్లార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకుని ఉదయానే్న ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
* తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
* అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.
* జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్ స్పూన్ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
* బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గుముఖం పడతాయి.
* తులసి ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది.
* అల్సర్ల నుంచి రక్షిస్తుంది.
* తులసి రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది.
* కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది.
* తులసి ఆకులను నమలడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
* అలర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.