గతేడాదిలో ముంబయి నుంచి ప్రైవేట్ జెట్ విమానాలు 1516 బయటు దేరాయి. దుబాయి నుంచి బయలుదేరిన 1400 సర్వీసులతో పోలిస్తే ఇది 8.28 శాతం అధికం కాగా, జపాన్ రాజధాని టోక్యో నుంచి ప్రారంభమైన సర్వీసులు 1202 కంటే 20 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ జాబితాలో అగ్రస్థానం మాత్రం న్యూయార్క్‌దే. ప్రపంచంలోనే అత్యధిక కుబేరులు నివసించే న్యూయార్క్ నుంచి 2018లో 66,968 ప్రైవేట్ జెట్ విమానాలు బయలుదేరాయి. ఈ జాబితాలో ముంబయి స్థానం 146 అని, కుబేరుల పర్యటక శైలిపై నివేదిక రూపొందించిన నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. దేశీయంగా చూస్తే, ముంబయిలోనే కుబేరులు ఎక్కువమంది ఉంటున్నారు.ఒకే రన్‌వేతో రోజూ 1,000 విమానాలఒకే రన్‌వే కలిగిన ముంబయి విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వరుసగా మూడో ఏడాది కూడా రోజూ దాదాపు 1,000 విమానాల రాకపోకలకు వీలు కల్పించిన ఘనత సొంతం చేసుకుంది. లండన్ సమీపంలోని గాట్విక్ దీనికంటే ముందుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన కేంద్రంగా దుబాయి విమానాశ్రయం నిలుస్తోంది.
దేశాల్లో ఉత్తర అమెరికా **అగ్రస్థానం
రాకపోకలు అధికంగా సాగించే ప్రైవేట్ జెట్ విమానాలు ఎక్కువ ఉన్న దేశాల్లో అగ్రస్థానం ఉత్తర అమెరికాదే. అక్కడ 13685 ప్రైవేట్ జెట్‌లున్నాయి. తరవాత స్థానాల్లో ఐరోపా, రష్యా, పాత సోవియట్ యూనియన్ సభ్యదేశాలున్నాయి. ఆయా దేశాల్లో 2879 చొప్పున జెట్ విమానాలున్నాయి.
* తదుపరి స్థానాల్లో బ్రిటన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ ఉన్నాయి.
* తమకు అనుకూలంగా ఉండే వాతావరణం, అభిరుచికి తగ్గ ప్రదేశాలనే తమ పర్యటనల కోసం కుబేరులు ఎంచుకుంటున్నారని నివేదిక తెలిపింది. అమెరికన్లు కెనడాకు వెళ్తుంటే, ఆస్ట్రేలియా సంపన్నులు న్యూజిలాండ్‌ను సందర్శిస్తున్నారని పేర్కొంది.
* అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచి జూన్‌లో ఎక్కువగా, బ్రిటన్ నుంచి ఏప్రిల్‌లో అధికంగా పర్యటనలకు వెళ్తున్నారు.
దుబాయి టోక్యోలను దాటేసిన బాంబే
Related tags :