జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి ఉద్భావన వేడుకలు నిర్వహిస్తారు. 1953 మార్చి 23న శ్రీరామనవమినాడు నెమలిలో స్వామి స్వయంభూగా వెలిశారు. 1957 ఫిబ్రవరి 6న స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఏటా శ్రీరామనవమికి స్వామివారి ఉద్భావన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. రుత్వికబృందం ఆదివారం ఉదయం స్వామివారి వలవిరాట్‌ను సువర్ణాభరణాలు, నూతన వస్ర్త్రాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తుంది. శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైన 9 రకాల ప్రసాదాలు, పానకం భక్తులకు పంపిణీ చేస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మైలవరపు రామాంజనేయులు, సహాయ కమిషనర్ జె.వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయ దత్తత ఆలయమైన ఆంజనేయస్వామి గుడిలోనూ ఆదివారం సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.
రేపు నెమలిలో ఉద్భావన వేడుకలు
Related tags :