మాళవిక సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి తెరపైకి రానున్నారు. చంద్రముఖి, ఉన్నైతేడి, వెట్రికొడి కట్టు, తిరుట్టుపయలే చిత్రాలతో తమిళ ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకుని ముంబయిలో కాపురం పెట్టారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి తెరపై దర్శనమివ్వడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై మాళవిక విలేకరులతో మాట్లాడుతూ ‘తన కెరీర్లో ‘వాళమీనుక్కు’ అనే పాట తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినీ రంగానికి కొంతకాలం దూరంగా ఉన్నా. నటనపై ఆసక్తితో మళ్లీ నటించాలని కోరుకున్నా. ఆ మేరకు ప్రస్తుతం రెండు చిత్రాలలో నటించే అవకాశమొచ్చింది. నచ్చిన పాత్రను ఎంచుకొని నటిస్తా’నని పేర్కొన్నారు.
వెల్కం
Related tags :