సాధారణంగా ఆలయాల్లో నైవేద్యం అనేది శాఖహారమే అనేది అందరికీ తెలిసిన సత్యం. కానీ, తమిళనాడులోని మునీశ్వరుడి ఆలయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించేది ఏమిటో తెలుసా? మటన్ బిర్యానీ. అవును మీరు విన్నది నిజమే. అక్కడి భక్తులకు వేడి వేడి మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇస్తారు. చాలా కాలం నుండి ఆ ఆలయంలో ఇదే తరహాలో బిర్యానీని ప్రసాదంగా ఇస్తున్నారట. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వడుకంపట్టి గ్రామంలో గల మునీశ్వరుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరిగే ఉత్సవాల్లో మటన్ బిర్యానీని ప్రసాదంగా పంచుతారు. దీనిలో భాగంగా గతేడాది 2 వేల కిలోల బాస్మతీ బియ్యం, 200 మేక మాంసంతో బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా అందించారు. ఈ ఏడాది కూడ ఇదే తరహలో స్వామి వారికి బిర్యానీ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, దీని వెనుక ఓ మంచి పురాణ కథ ఉంది. 85 ఏళ్ల క్రితం ఎస్వీఎస్ సుబ్బానాయుడు అనే వ్యక్తి మునీశ్వరుడు పేరుతో ప్రారంభించిన హోటల్‌కు బాగా లాభాలు వచ్చాయి. ఆ హోటల్ లో మటన్ బిర్యానీ ప్రత్యేకం. దాంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్ బిర్యానీతో నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచారట. అప్పటి నుంచి గ్రామస్థులంతా కలిసి బిర్యానీ తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా మారింది. అంతే… రాష్ట్రంలో వందల సంఖ్యలో మునియాండి మాంసాహార హోటళ్లు వెలిశాయి. ఇక ఈ నెల 25న వేకువజామున మునియాండి బిర్యానీ నైవేద్యం పెట్టి, అనంతరం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు పంపిణీ చేయనున్నారు.
ఈ ఆలయంలో ప్రసాదంగా వేడి వేడి మటన్ బిర్యానీ
Related tags :