Food

పుచ్చకాయ బరువు పెంచదు

watermelon is full of vitamins and wont increase weight

పుచ్చకాయను చాలా మంది మంచి ఆహార పదార్థంగా పరిగణించరు. కళ్లకు ఇంపుగా, ఎర్రగా కనిపించడమే తప్ప దానిలో ఏముంటాయి… నీళ్లు తప్ప? అంటూ ఉంటారు. నిజమే! వేసవిలో పొడిబారిపోయిన శరీరాన్ని తడితో నింపే కాసింత నీరు, కాస్తంత ఫైబర్‌ ఇంతేగా అనుకుంటారు. కానీ పుచ్చకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అవి…కేలరీలు అతి తక్కువగా ఉండే పుచ్చకాయను ఎంత తిన్నా శరీరం బరువు పెరిగే ప్రమాదం ఉండదు. బరువు పెరుగుతామోనని భయపడే వారు నిరభ్యంతరంగా పుచ్చకాయను తీసుకోవచ్చు. పుచ్చకాయలో శరీరానికి అవసరమైన పలు పోషకాలు ఉన్నాయి. అతి ప్రధానమైన సి, బి, ఏ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కెరటోనాయిడ్లు సమృద్దిగా ఉన్నాయి. వీటికి శరీరంలో వాపు ఏర్పడకుండా నియంత్రించే గుణాలు కూడా ఉన్నాయి.కేన్సర్‌ను నివారించే కుకుర్‌బిటాసిన్‌- ఇ, లైకోపిన్‌లు పుచ్చకాయలో సమృద్దిగా ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, గుండెకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలను నివారించే శక్తి కూడా దీనికి ఉంది. వ్యాయామం చేయడం ద్వారా కలిగే అలసటను తొలగించడంతో పాటు, కండరాల బలహీనతను తగ్గించేందుకు కావలసిన పలు అంశాలు కూడా పుచ్చకాయలో ఉన్నాయి.