లోక కల్యాణంగా భావించే రాములోరి కల్యాణం భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగింది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లఘ్నమందు సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాన్ని నిర్వహించారు. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు. కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు స్వామి, అమ్మవారికి సమర్పించారు. సీతారాముల కల్యాణ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భద్రాద్రి ఆలయం కిటకిట లాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు.
రామయ్య పెళ్లికొడుకాయనే….
Related tags :