అమెరికాలోని బోఇసీ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 6న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వందల మంది బోఇసీ తెలుగు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పిల్లలు, పెద్దలు వినూత్న కార్యక్రమాలతో అలరించారు. ‘తేనెల తేటల మాటలతో’ అంటూ సభ్యులు సభ మొదలు పెట్టారు. పద్యాలు, అన్నమయ్య కీర్తనలు, టాలీవుడ్ నృత్యాలు , తెలుగుదనం ఉట్టిపడే నృత్య మాలిక, మాస్, సెమి క్లాసికల్ నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ సంవత్సరం విశేషంగా కొన్ని పాటలకు పిల్లలే కోరియోగ్రఫీ చేసి తమ ప్రతిభను కనబరిచారు. అనంతరం తెలుగు వంటలతో భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఎంతో సరదాగా, సంబరంగా సాగి పోయింది.
బోయిసీ ప్రవాసుల వికారినామ ఉగాది వేడుకలు
Related tags :