సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన జనసేన, వామపక్షాల కూటమికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చునని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అభిప్రాయపడ్డారు. కొన్నిచోట్ల తాము ప్రభావవంతంగా పనిచేయలేకపోయామని ఆయన అంగీకరించారు. తొలివిడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కంటే స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతినే ఎక్కువగా పట్టించుకుని ఓటు వేశారని అన్నారు. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పనితీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థగా స్వేచ్ఛగా, సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు.
మేము సరిగ్గా పనిచేయలేదు.గెలవకపోవచ్చు.
Related tags :