ScienceAndTech

రామనవమి నాడు భారతీయులకు ఫేస్‌బుక్ కానుక

facebook downtime in india

సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ ప్రపంచ వ్యాప్తంగా సరిగ్గా పని చేయడం లేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఫేస్‌బుక్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ డౌన్‌ అయింది. వాటిని తెరచి చూసిన వారు ఇంతకు ముందూ ఎన్నడూ లేనంతగా తరుచూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా ఆగిపోవడం, లోడ్‌ అవడానికి చాలా సమయం తీసుకుంటుండడంతో వాటి వినియోగదారులు విసుగు చెందుతున్నారు. నెటిజన్లు తమ బాధను ట్విటర్‌లో చెప్పుకుంటున్నారు. భారత్‌లోని చాలా మంది యూజర్లది ఇదే పరిస్థితి. ముఖ్యంగా అమెరికా, మలేసియా, టర్కీ యూజర్లు ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫేస్‌బుక్‌ మొబైల్‌ యాప్‌ మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా పని చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లో కూడా కొన్ని సమస్యలు తలెత్తాయి.. ప్రస్తుతం మళ్లీ పని చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 13న కూడా ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే పనిచేసింది. ఆదివారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో సామాజిక మాధ్యమాలకు బాగా అలవాటైపోయిన వారు తెగ బాధపడిపోతున్నారు