మరయూరు చక్కెర గురించి విన్నారా? మనదేశంలో అత్యంత తీయనైన బెల్లం అంటే అదే! దీన్ని కేరళలో తయారుచేస్తారు. కేరళ పేరుచెబితే బెల్లం ఒక్కటే కాదు… వివిధ రకాల మేలురకం సుగంధ ద్రవ్యాలూ గుర్తుకొస్తాయి. ఎవరైనా అక్కడకు వెళ్తుంటే ‘వచ్చేటప్పుడు అక్కడ నుంచి మిరియాలు తీసుకురండీ.. బాగుంటాయట’ అనో, ‘అక్కడ కొండల్లో పండించిన దాల్చినచెక్క రుచి భలేగా ఉంటుందట వచ్చేటప్పుడు తీసుకురండీ’ అనో అంటాం. ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోకెళ్లి డీ-స్పైసెస్ వెబ్‌సైట్‌లోకి వెళ్తే కేరళలో దొరికే వందల రకాల సుగంధద్రవ్యాలని కొనుక్కోవచ్చు. ఇడుక్కి, వైనాడ్, మున్నార్, కొట్టాయం రైతులు ఆర్గానిక్ పద్ధతిలో పండించిన అనేకరకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అడవి తేనె, వివిధ రకాల మసాలాపొడులు, నిమ్మగడ్డితో చేసిన నూనె, కోకమ్, వివిధ రకాల మసాలా కాఫీపొడులు లభించడం డీస్పైసెస్ ప్రత్యేకత.
ఆర్గానిక్ మసాలాలు అమ్ముతున్న కేరళ వెబ్‌సైట్
Related tags :